Bollywood Celebs: ఈ బాలీవుడ్ సుందరీమణులు నాజుగ్గా ఉంటారు.. కానీ మంచి ఆహారప్రియులు.. నచ్చిన ఫుడ్ కనిపిస్తే వదలరు

|

Mar 03, 2022 | 12:38 PM

Bollywood Celebs: శారీరకంగా ఆరోగ్యంగా శక్తి కలిగి ఉండాలంటే.. తప్పని సరిగా మంచి పోషకాహారం తీసుకోవాల్సిందే. అయితే సన్నగా, ఫిట్ గా ఉండడం కోసం కొంతమంది సెలబ్రెటీలు(Celebreties) తినే ఆహారం విషయంలో..

Bollywood Celebs: ఈ బాలీవుడ్ సుందరీమణులు నాజుగ్గా ఉంటారు.. కానీ మంచి ఆహారప్రియులు.. నచ్చిన ఫుడ్ కనిపిస్తే వదలరు
Bollywood Celebs Food Habit
Follow us on

Bollywood Celebs: శారీరకంగా ఆరోగ్యంగా శక్తి కలిగి ఉండాలంటే.. తప్పని సరిగా మంచి పోషకాహారం తీసుకోవాల్సిందే. అయితే సన్నగా, ఫిట్ గా ఉండడం కోసం కొంతమంది సెలబ్రెటీలు(Celebreties) తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.  పండ్లు(Fruits), సలాడ్స్(Salads) , కొబ్బరి నీరు(Coconut water) వంటివాటిని మాత్రమే తాము తినే ఆహారంలో ఎక్కువగా  చేర్చుకుంటారు. అయితే ఎంత సెలబ్రెటీలు అయినా ఎప్పుడూ తమకు ఇష్టమైన ఆహారపదార్ధాలు దూరంగా ఉండాలంటే కష్టమే.. అయితే తాము ఇష్టంగా తినే వంటకాలను తెలుపుతూ.. ఒకటి లేదా రెండు ఫోటోలు తీసుకుంటారు. ఈరోజు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇష్టంగా తినే ఆహారపదార్ధాల గురించి తెల్సుకుందాం..

శిల్పా శెట్టి: సీనియర్ నటి శిల్పా శెట్టి ఫిగర్ చూసిన వారు ఎవరైనా.. ఆమె తినే తిండి విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారని అందరు భావిస్తారు. అయితే నిజానికి శిల్పా శెట్టి మంచి ఆహార ప్రియురాలు. తన ఫిట్‌నెస్‌పై రాజీ పడకుండా.. తనకు నచ్చిన ఫుడ్ ను కావాలినంత తింటుంది.. అయినప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది.  4 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో ఉన్న శిల్పా శెట్టి కి చాలా ఇష్టమైన ఫుడ్ .

దీపికా పదుకొణె: ఈ స్టార్ హీరోయిన్ క్రీడాకారిణి కూడా.. తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకుంటుంది. అయితే ఎక్కువగా చాక్లెట్ , డెజర్ట్‌ని ఇష్టపడుతుంది. ఈ బ్యూటీ ఎక్కువగా చాక్లెట్ బార్‌లో కొరుకుతూ డెజర్ట్‌లో మునిగిపోయే వీడియోలను తరచుగా పోస్ట్ చేస్తుంది.

సోనమ్ కపూర్ అహూజా: ఈ నటి చిన్నతనంలో అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడింది. నటి కాక ముందు భారీ శరీరంతో ఉండేది. ఇప్పటికీ సోనమ్ తనకు నచ్చిన, మెచ్చిన వంటలను తినడకుండా ఉండలేదు. అందుకనే నచ్చిన ఫుడ్ ను కావాల్సినంత తింటుంది.. అదే సమయంలో కఠినమైన వ్యాయామం చేస్తుంది. ఈమె ఆహార నియమాలు.. ఆహారప్రియులకు మంచి సహాయకారి.

ప్రియాంక చోప్రా జోనాస్: ఈ అందాల రాశి.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా మంచి భోజన ప్రియురాలు. ముఖ్యంగా భారతీయ వంటలు అంటే ప్రియాంకకు చాలా ఇష్టం. యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న సమయంలో తాను ఇంట్లో తయారుచేసిన భారతీయ ఆహారాన్ని,  దాల్-రోటీని మిస్ అవుతున్నట్లు చెబుతుంది కూడా..

అలియా భట్: ఈ నటి అలియా భట్ ఫ్రైడ్ ఫుడ్ గురించి ఓ వీడియో చాలా రోజుల క్రితం పోస్టు చేసింది. తాను ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ఇష్టపడతానని చెప్పింది. అంతే కాదు..  ఈ భామ్మ తినే ఫుడ్ ను ఎంజాయ్ చేస్తుంది.  రోజుకు మూడు పూటలా భోజనం తింటుంది. అది తినాలి ఇది తినాలి అనే నియమాలు పెట్టుకోడు.. తినే ఫుడ్ విషయంలో సలాడ్‌ల నుండి కప్‌కేక్‌ల  వరకూ ఏది తిన్నా.. ఆస్వాదిస్తూ తింటుంది.

నర్గీస్ ఫక్రీ: ఫ్యాషన్, ఫుడ్‌తో ప్రయోగాలు చేయడాన్ని నర్గీస్ ఫక్రీని ఇష్టపడుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఆమె తరచుగా వంటగదిలో ప్రయోగాలు చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

Also Read:

యుద్ధానికి దగ్గరగా కేంద్ర మంత్రులు.. ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద.. భారతీయుల తరలింపులో పాలుపంచుకుంటున్న..