Bigg Boss Sarayu: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ సరయు.. ఫోటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సరయు కూడా ఒకరు. ఇప్పుడు ఈ నటి తెలుగు సినిమాల్లో కమెడియన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సరయు తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Bigg Boss Sarayu: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ సరయు.. ఫోటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?
Bigg Boss Sarayu

Updated on: Oct 18, 2026 | 2:22 PM

యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించింది సరయు. షార్ట్ ఫిల్మ్స్, సిరీస్ లు చేస్తూ నెట్టింట ఫేమ్ తెచ్చుకుంది. సరయుకు 7 ఆర్ట్స్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆమె చేసే వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బోల్డ్ గా సరయూ చేసిన కంటెంట్ కి కుర్రకారు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాట తీరుతో మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లోనూ పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఈ మధ్య అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది సరయు. హీరోయిన్లకు ఫ్రెండ్ గా, కమెడియన్ గా, సహాయక నటిగా కనిపిస్తోంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సరయు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో పెళ్లే చేసుకోనని చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సడెన్ గా మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. అది కూడా సీక్రెట్ గానే. పెళ్లి దుస్తుల్లో ఉన్న సరయు తన తల్లి ముద్దు పెడుతున్న ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ‘నేను ఎప్పటీకీ అమ్మ కూతురినే. ఇప్పుటి నుంచి కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఇది సాక్ష్యాత్తూ ఆ పరమ శివుడే నా కోసం రాసినదని నేను నమ్ముతున్నాను. ఆ దేవుడు దీవెనలు మాటల్లో చెప్పలేనంత పవిత్రమైనవి. కొన్ని ఆరంభాలకు ప్రత్యేకమైన అనౌన్స్‌మెంట్‌లు అవసరం లేదు. కేవలం అచెంచలమైన విశ్వాసం, అమ్మ ప్రేమ, ఆ మహాదేవుని అనుగ్రహం ఉంటే చాలు. హర్ హర్ మహాదేవ్’ అని రాసుకొచ్చింది సరయు.

 

ఇవి కూడా చదవండి

కాగా ఈ పోస్టులో ఎక్కడా డైరెక్టు గా తన పెళ్లి గురించి మాట్లాడలేదు సరయు. అంతేకాదు.. ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఓ వ్యక్తి చేయిపట్టుకుని నడుస్తున్న ఫొటోని కూడా షేర్ చేసిసింది. అయితే అతని ఫేస్‌ని మాత్రం చూపించలేదు. కనీసం ఎవర్ని పెళ్లి చేసుకుందో కూడా చెప్పలేదు. దీంతో సరయు పెళ్లి చేసుకుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు, ఫాలోవర్స్ ఆమెకు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బిగ్ బాస్ సరయు షేర్ చేసిన పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us