
బేబీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది కిర్రాక్ సీత అలియాస్ సుప్రజ. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నెగిటివ్ రోల్‌లో అద్భుతంగా నటించింది సీత. అయితే ఇదే బేబీ సినిమానే ఆమె నెగెటివ్ గా కూడా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌ని చెడగొట్టే క్యారెక్టర్‌లో నటించిన కిర్రాక్ సీతతో కొందరు దారుణంగా ప్రవర్తించారు. ఏకంగా రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరించారు. సినిమాల్లోకి రాకముందు యూట్యూబర్ గా బాగా ఫేమస్ అయ్యింది సీత. ముఖ్యంగా 7 ఆర్ట్స్ సరయూతో కలిసి చాలా వీడియోలు చేసింది. 7 ఆర్ట్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఛాన్స్ కొట్టేసింది. బిగ్‌బాస్ హౌస్ లో సుమారు 40 రోజుల పాటు ఉన్న సీత తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానులకు బాగానే నచ్చేసింది. ప్రస్తుతం టీవీ షోస్ తో పాటు సినిమాల్లోనూ నటిస్తోన్న సీత రీసెంట్ గా ఒక టాక్ షోకు హాజరైంది. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయట పెట్టింది.
‘7 ఆర్ట్స్‌లో షూట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి నాకు కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే.. ఒక సినిమాలో ఆఫర్ ఉందన్నాడు. ఎవరికైనా సినిమాలో ఆఫర్ వచ్చిందంటే హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. నేను కూడా సంతోష పడ్డాను. అప్పుడు నేను చిన్నపిల్లని 21 ఏళ్లు ఉంటాయి. సినిమా చేస్తానని నేను ఓకే చెప్పాను. అయితే నన్ను ఫాం హౌస్‌కి రావాలని చెప్పారు. ఫాంహౌస్‌కి ఎందుకండి.. ఆఫీస్ ఉంటుంది కదా అని అడిగితే.. మొత్తం టీమ్‌ని పిలుస్తున్నారని చెప్పడంతో సరేనని అన్నాను. కానీ ఫాం హౌస్‌కి వెళ్లలేదు.. సాయంత్రం దాకా కాల్స్ లిఫ్ట్ చేయలేదు. వాళ్లు కూడా నన్ను ప్రెజర్ చేయలేదు. అయితే రెండు మూడు రోజుల తర్వాత వాళ్లు కాల్ చేసి ఎందుకు రాలేదని అడిగారు. నాకు కరెక్ట్ కాదని అనిపించిందని చెప్పడంతో మీకు 25 లక్షలు ఇస్తారట అని చెప్పడంతో నేను వెంటనే నో చెప్పేశాను. మాకు తరచుగా ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి.. నార్మల్‌గా మెసేజ్‌లు కూడా పెడుతుంటారు. మీ నెంబర్ ఎవరికైనా దొరికితే.. మేము ఒక సిరీస్ తీస్తున్నామని చెబుతారు. మీరు ఓకే నంటే సినిమా ఇండస్ట్రీలో పరిస్ధితులు తెలుసు కదా అని అంటారు. ఎలా ఉంటదని అడిగితే .. వాళ్లు ఏదో ఒకటి చెబుతుంటారు. నేను నీకు సిగ్గుందా అని అంటాను. కొంతమంది సరదాగా చేస్తారు.. వాళ్లు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కాదు. వాళ్లకు నేనెవరో తెలియదు.. కానీ ఆమె అలాంటిది, ఇలాంటి ఒకసారి టెస్ట్ చేద్దామని కాల్స్ చేస్తుంటారు’ అని కిర్రాక్ సీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.