Bigg Boss Telugu 10: ఆరోవారం ఓటింగ్‌లో దుమ్మురేపుతోన్న రోహిత్.. డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరోవారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లోకి వచ్చారు. వీరిలో ఎప్పటిలాగే రోహిత్ టాప్ లో దుమ్మురేపుతున్నాడు. అయితే ఈసారి డేంజర్ జోన్ లో ఇద్దరు టాప్ కంటెండర్స్ ఉన్నారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 10: ఆరోవారం ఓటింగ్‌లో దుమ్మురేపుతోన్న రోహిత్.. డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేట్ ఎవరంటే?
Bigg Boss Telugu 10

Updated on: Oct 14, 2026 | 8:59 PM

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరింత రసవత్తరంగా మారింది. ఐదోవారంలో అనూహ్యంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అందుకు తగ్గట్టుగానే ఆరోవారం నామినేషన్స్ యమ హీట్‌గా సాగాయి. కామనర్సన్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య పోరు ఒక మినీ వార్ ను తలపించింది. కంటెస్టెంట్స్ మధ్య మాటల తూటాలు పేలాయి. మొత్తానికి ఈ ఆరోవారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. కొత్తగా వచ్చిన వైల్డ్ ఫైర్స్ ద్వారా ఈ నామినేషన్స్ జరగడం విశేషం. షాలిని, వర్షిణి, వంశీ, రాం ప్రసాద్, అమన్, రోహిత్ ఈ వారం నామినేట్ అయిన వారిలో ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి? ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎవరేం అనుకున్నా రోహిత్‌కి ఓట్లు అయితే భారీగా పడుతున్నాయి. పైగా ఈవారంలో త్రిగుణ్, ముకేష్‌లు నామినేషన్స్‌లో లేరు కాబట్టి ఓటింగ్ లో రోహిత్ దే టాప్ ప్లేస్. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న అన్ అఫీషియల్ పోల్స్ చూస్తుంటే.. రోహిత్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు.

ఇక రెండో స్థానంలో జబర్దస్త్ కమెడియన్ రాం ప్రసాద్ ఉన్నాడు. కామనర్ అమన్ మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక రోహిత్, షాలినీలకు చుక్కలు చూపించిన టెంపర్ వంశీ ఓటింగ్ లోనూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతను నాలుగో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ లో వంశీ దాదాపు ఉండకపోవచ్చు. ఇక ఐదో స్థానంలో యాంకర్ వర్షిణీ ఉండగా, ఫైర్ బ్రాండ్ షాలినీ ఆరో ప్లేస్ లో ఉంది. అంటే ఈ వారంలో వర్షిణీ, షాలినీ డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. వీరిద్దరిలో ఎవరు ఒకరో ఈ వారం ఎలిమినేట్ కావొచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం షాలినీపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. అయితే బిగ్ బాస్ కు అవసరమైన కంటెంట్ ఆమె నుంచే వస్తోందన్న అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి ఆమెను బయటకు పంపించే అవకాశాలు తక్కువే అని చెప్పవచ్చు. మరోవైపు వర్షిణీ కూడా తన నిలకడైన ఆట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మన్ననలు అందుకుంటోంది. అయితే ఆమె నుంచి పెద్దగా కంటెంట్ రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? లేదా మరొకరు బయటకు వెళ్లిపోతారా? అన్నది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ దాకా వేచి చూడాల్సిందే.

బిగ్ బాస్ తెలుగు 10 లేటెస్ట్ ప్రోమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us