Bigg Boss Telugu 10: ఆ కంటెస్టెంట్‌కు ఫేవర్‌గా బిగ్‌బాస్ షో.. సంచలన కామెంట్స్ చేసిన గీతూ రాయల్

గతంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొని ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది గీతూ రాయల్. అలాగే బిగ్ బాస్ బజ్ షోకు హోస్ట్ గా కూడా వ్యవహరించిందామె. ప్రస్తుతం బిగ్ బాస్ రివ్యూయర్ గా వ్యవహరిస్తోన్న గీతూ రాయల్ తాజాగా ఈ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసింది.

Bigg Boss Telugu 10: ఆ కంటెస్టెంట్‌కు ఫేవర్‌గా బిగ్‌బాస్ షో.. సంచలన కామెంట్స్ చేసిన గీతూ రాయల్
Bigg Boss Telugu 10

Updated on: Oct 27, 2026 | 6:26 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా, రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో వారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం బిగ్ బాస్ 10 త్రిగుణ్ వర్సెస్ రోహిత్ అన్న చందంగా మారిపోయింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటి కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ ఈసారి కచ్చితంగా విజేత అవుతాడని ఒక వర్గం చెబుతుంటే.. మరొకవైపు తనదైన ఆట తీరుతో ఫర్ఫెక్ట్ గేమర్ గా పేరు సొంతం చేసుకున్న త్రిగుణ్ బిగ్ బాస్ కప్పు కొడతాడని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మరోవైపు బిగ్ బాస్ విన్నర్లు, మాజీ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ 10 పై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టాప్-5 లో ఎవరెవరు ఉంటారో, విజేతగా ఎవరు నిలుస్తున్నారన్న దానిపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొని సత్తా చాటిన గీతూ రాయల్ బిగ్ బాస్ 10 షో తీరు పై సంచలన కామెంట్స్ చేసింది.

‘బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ ఏదైతో చెప్పాడో అది పర్ఫెక్ట్. రోహిత్ కి కూడా తెలుసు బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్ గా వ్యవహరిస్తున్నాడు అని. రోహిత్ చెప్పిన పాయింట్ ఏంటంటే.. ‘నువ్వు మాట్లాడినట్లు నేను మాట్లాడి ఉంటే.. నువ్వు బిహేవ్ చేసినట్టు నేను బిహేవ్ చేసి ఉండుంటే, ఇప్పటికి నాకు రెండు మూడు యెల్లో కార్డ్స్ వచ్చి ఉంటాయి’అని అన్నాడు. రోహిత్ ఏ విధంగా అయితే తన మాటలను బయటపెట్టాడో అతడు చెప్పింది అక్షర సత్యం. త్రిగుణ్ బిహేవ్ చేసినట్టు రోహిత్ బిహేవ్ చేసి ఉండుంటే కచ్చితంగా ఈ పాటికి రెడ్ కార్డ్ వచ్చి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయేవాడు. మొత్తం బిగ్ బాస్ షో త్రిగుణ్ కి ఫేవర్ గా నడుస్తోంది. అదొక పనిష్మెంటా.. బొచ్చులో పనిష్మెంట్.. ఆ చేతులకు సంకెళ్లు ఏంటి? ఆ చేతులకు సంకెళ్లు వేశారు ఓకే.. ఎక్కడో ఒకచోట కట్టేయాలి కానీ అలా వదిలేయడం ఏంటి? నిజంగా చెబుతున్నాను బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్ గా నడుస్తోంది’ అని చెప్పుకొచ్చింది గీతా. ప్రస్తుతం ఈ మాజీ కంటెస్టెంట్స్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us