
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభమైంది. ఎప్పటిలాగే గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ అట్టహాసంగా జరుగుతోంది. ఇక ఈ సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి దేబ్ జానీ మోదక్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ గా ప్రముఖ నటుడు త్రిగుణ్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. కాగా హీరో త్రిగుణ్ అసలు పేరు ఆదిత్ అరుణ్. తెలుగు, తమిళం భాషల్లో హీరోగా పలు సినిమాలు చేశాడు. అలాగే సెకెండ్ హీరోగానూ ఆకట్టుకున్నాడు. 2009 లో కథ అనే తెలుగు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో జెనీలియా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగ ఆడలేదు. అయినా హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ్ లో హీరోగా, సెకెండ్ హీరోగా దాదాపు 30 సినిమాలు చేసాడు. కథ, తుంగభద్ర, గరుడవేగా, 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ, లైన్ మ్యాన్, ఈషా తదతర సినిమాల్లో నటించాడు త్రిగుణ్. అలాగే పలు వెబ్ సిరీసుల్లోనూ త్రిగుణ్ నటించాడు.
ఇక రీసెంట్ సూపర్ హిట్ సినిమా చెన్నై లవ్ స్టోరీలోనూ సెకెండ్ హీరోగా చేశాడు త్రిగుణ్ . ప్రస్తుతం యూత్ లోనూ ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిగుణ్ తాను అందరిలో ఒకడిలా ఉంటానని చెప్పుకొచ్చాడు. మరి సిల్వర్ స్క్రీన్ పై ఆకట్టుకున్న త్రిగుణ్ స్మాల్ స్క్రీన్ పై ఎలా సత్తా చాటుతాడో చూడాలి.
The BIGG game welcomes its next player!⚔️👁️#Thrigun is here to bring his Unstoppable energy & BIGG drama to the house!🔥
Watch the Grand Launch of #BiggBossSeason10, Playing Now only on #StarMaa#BiggBossTelugu10 #BiggBossTelugu10GrandLaunch pic.twitter.com/3KzhCnbCwn
— Starmaa (@StarMaa) September 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి