Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ పై సంచలన కామెంట్స్ చేసిన సిరి మదర్.. నాకు నచ్చడం లేదు అంటూ..

బిగ్ బాస్ హౌస్‌లో అల్లర్లు, గొడవలు, ఏడుపులతో సాగుతూ వస్తున్న బిగ్ బాస్‌లో తాజాగా ఎమోషన్స్ పర్వం నడుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి హౌస్ మేట్స్ ఇంటిసబ్యులను పంపించాడు బిగ్ బాస్.

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ పై సంచలన కామెంట్స్ చేసిన సిరి మదర్.. నాకు నచ్చడం లేదు అంటూ..
Bigg Boss

Updated on: Nov 25, 2021 | 3:31 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అల్లర్లు, గొడవలు, ఏడుపులతో సాగుతూ వస్తున్న బిగ్ బాస్‌లో తాజాగా ఎమోషన్స్ పర్వం నడుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి హౌస్ మేట్స్ ఇంటిసబ్యులను పంపించాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో కాజల్ కూతురు ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. కాజల్ కాస్త ఎమోషన్ అయినప్పటికీ ఆతర్వాత సరదాగా కూతురుతో మాట్లాడుతూ హంగామా చేసింది. ముందుగా తల్లిని చూడగానే కాజల్ కూతురు ఎమోషనల్ అయ్యింది. ఆతర్వాత కూతురును పట్టుకుని ఏడ్చేసింది. ఇక మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే కోపం వస్తాదా అని శ్రీరామ్ అడగ్గా.. అవునంటూ తలుపింది కాజల్ కూతురు.  ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో మానస్ తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ముందుగా హౌస్ లో వున్నా వాళ్ళను ఫ్రీజ్ అవ్వమని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో అందరి ఫ్రీజ్ అయ్యారు. ఆతర్వాత మానస్ మదర్ ఎంట్రీ ఇచ్చారు.

ఆతర్వాత అందరిని రిలీజ్ చేశారు బిగ్ బాస్. ఇక మానస్ మదర్ హౌస్ లో సందడి చేశారు. అందరితో మాట్లాడుతూ.. అందరిపై కౌంటర్లు వేస్తూ సరదాగా గడిపారు. శ్రీరామ్ ఆంటీ అని పిలిస్తే ఎందుకు నన్ను ఆంటీ అని పిలుస్తున్నావ్ అంటూ నవ్వేశారు. అలాగే కాజల్‌ను చూసి ఏం వాయిస్ తల్లి ఎలా భరిస్తున్నారో అంటూ కౌంటర్లు వేశారు. ఆతర్వాత అందరితో ఆడి పాడి అలరించారు. ఆతర్వాత హౌస్ లోకి సిరి మదర్ వచ్చారు. తల్లిని చూడగానే సిరి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను కౌగిలించుకుంది. నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావ్ అంటూ చెప్తూనే నువ్ షణ్ముఖ్ ని కౌగిలించుకోవడం నాకు  అని అన్నారు. బాగా హెల్ప్ చేస్తున్నాడు అందుకు దగ్గరైపోతుంది. అందుకు నాకు నచ్చడం లేదు అని అన్నారు . దాంతో షణ్ముఖ్ మొహం మాడిపోయింది. చూడాలి మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut: తమ ముందు హాజరు కావాలని నటి కంగనా రనౌత్‌కు సమన్లు​జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ.. ఎందుకంటే..

Chiranjeevi: ఏపీ సర్కార్ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. కొన్ని సూచనలు

Viral Photo: ఈ పాలబుగ్గల చిన్నారికి అభిమానుల్లో యమా క్రేజ్.. తెలుగునాట సూపర్ హిట్స్ అందుకుంది..

 

Loading...
Unable to load recommendations.
Follow Us