Bigg Boss 10 Telugu : ఇదెక్కడి ట్విస్ట్ రా బాసూ.. త్రిగుణ్‏కు షాకిచ్చిన ముకేష్.. విన్నర్ అయ్యేది అతడే..

ఫ్యామిలీ వీక్ తర్వాత బిగ్ బాస్ ఓటింగ్ పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు అత్యధిక ఓటింగ్ తో టాప్ లో దుమ్మురేపిన త్రిగుణ్ ఇప్పుడు రెండో స్థానంలో పడిపోయాడు. ఊహించని విధంగా ముకేష్ టాప్ ప్లేస్ లోకి దూసుకోచ్చాడు. ఈవారం ఓటింగ్ లో భారీ మార్పులు చేసుకున్నాయి. ఈ 11వ వారం ఓటింగ్ ఎలా ఉందంటే..

Bigg Boss 10 Telugu : ఇదెక్కడి ట్విస్ట్ రా బాసూ.. త్రిగుణ్‏కు షాకిచ్చిన ముకేష్.. విన్నర్ అయ్యేది అతడే..
Bigg Boss 10 Telugu 11th We

Updated on: Nov 20, 2026 | 9:59 PM

బిగ్ బాస్ సీజన్‌లలో పదో వారం దాటిందంటే విన్నర్ ఎవరు కాబోతున్నారనే దానిపై ప్రేక్షకుల్లో ఒక అంచనా మొదలవుతుంది. 11వ వారానికి చేరుకునేసరికి ఆ అంచనాలు మరింత స్పష్టంగా మారుతుంటాయి. ముఖ్యంగా ఈ దశలో వచ్చే ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌లు, ఆదివారం వేదికపై కుటుంబ సభ్యులు ఇచ్చే టాప్-5 ర్యాంకింగ్స్ విజేత ఎవరనే విషయంలో కీలక సంకేతాలిస్తుంటాయి. బయట ఉన్న ప్రజాదరణ, ఓటింగ్ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని కుటుంబీకులు ఎవరికి తొలి స్థానం ఇస్తారో, ఎవరికి రెండో స్థానం కేటాయిస్తారో అనేది ఆసక్తికరంగా మారుతుంది. సొంత కుటుంబ సభ్యులకు కాకుండా, ఇతర కంటెస్టెంట్లకు ఎక్కువ మంది అగ్రస్థానం ఇస్తే—వారికి టైటిల్ అవకాశాలు బలంగా ఉన్నాయనే అభిప్రాయం తరచూ వినిపిస్తుంటుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే, ఫ్యామిలీ వీక్ సమయంలో త్రిగుణ్‌కు సానుకూల రేటింగ్స్ రావడంతో చాలామంది అతనే విన్నర్ రేసులో ముందున్నారని భావించారు. అందుకు తగ్గట్టుగానే త్రిగుణ్ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. కుటుంబ సభ్యుల మాటలు, సంకేతాలు కూడా అతనిలో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో హౌస్ లోపల, బయట విజేత అంచనాలపై చర్చలు జోరుగా సాగాయి.

కానీ ఆటలో అసలు మలుపు ఓటింగ్ రూపంలో మొదలైంది. త్రిగుణ్‌కు గట్టి పోటీ ఇస్తూ ముకేష్ గౌడ దూసుకురావడం ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తన సీరియల్ అభిమానుల మద్దతుతో ముకేష్ అనధికార పోల్స్‌లోనూ త్రిగుణ్‌తో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాడు. ఈ 11వ వారంలో ఏకంగా 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో నిలిచారు. నీతూ మాస్టర్, శివ, రామకృష్ణ, వర్షిణి, సుధీర్, అమన్, దేబ్జానీ, రాం ప్రసాద్, వంశీ, త్రిగుణ్, ముకేష్ నామినేషన్లలో ఉండగా.. దాదాపు 60 శాతం ఓటింగ్ కేవలం త్రిగుణ్, ముకేష్ మధ్యే పంచుకోవడం విశేషం.

ముకేష్ సుమారు 30.86 శాతం ఓటింగ్‌తో ముందంజలో కనిపిస్తున్నాడు. త్రిగుణ్ 30.56 శాతం ఓటింగ్‌తో అత్యంత స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచి గట్టి పోటీ ఇస్తున్నాడు. వీరిద్దరి తర్వాత అమన్, దేబ్జానీ చెరో 8 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉండగా.. వంశీ (6%), రాం ప్రసాద్ (5%), వర్షిణి (4%), సుధీర్ (4%), శివ (3%), రామకృష్ణ (2%), నీతూ మాస్టర్ (1%) వరుస స్థానాల్లో ఉన్నట్లు ఓటింగ్ సరళి సూచిస్తోంది. మిగిలిన తొమ్మిది మందిలో ఎవరూ కూడా సింగిల్ డిజిట్‌ను దాటలేకపోయారు. ప్రస్తుత ఓటింగ్ ప్రకారం అతి తక్కువ ఓట్లతో నీతూ మాస్టర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు రామకృష్ణ, శివ కూడా ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నవారి జాబితాలో కనిపిస్తున్నారు. ఈ హోరాహోరీ పోరులో ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు, విన్నర్ రేసులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us