మరోసారి వైరల్ అవుతున్న బర్రెలక్క.. అలాంటి ప్రశ్నలడుగుతున్నారంటూ కన్నీళ్లు
బర్రెలక్క.. సోషల్ మీడియాలో ఈ పేరు పెద్ద సెన్సెషన్. డిగ్రీ చదివినా ఉద్యోగాలు వస్తాలేవు.. అందుకే బర్రెలు కాస్తున్నా అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో నెట్టింట ఆమె షేర్ చేసిన వీడియో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆమెకు యువత, స్టార్స్, ప్రముఖులు సపోర్ట్ చేశారు.

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతిచ్చారు కూడా. దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. ఆ మధ్య పెళ్లి గురించి వార్తల్లో నిలిచింది. తన పై పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తున్నారంటూ భోరుమని ఏడ్చేసింది శిరీష. తాజాగా ఓ వీడియోను షేర్ చేసిన శిరీష.. అందులో కన్నీరు పెట్టుకుంటూ కనిపించింది. తనకు ఓ సమస్య ఉందంటూ భోరుమని ఏడ్చేసింది.
పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు బర్రెలెక్కకు ఏమైంది? అని ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బర్రెలక్క తాజాగా షేర్ చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నా.. తలనొప్పి, జలుబుతో చాలా బాధ పడుతున్నాను. ముఖ్యంగా జలుబు బాగా ఇబ్బంది పెడుతుంది. అయితే జ్వరం వచ్చిందని వీడియో చేసి పెడితే చాలా మంది తనకు కామెంట్స్ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నారని తెలిపింది బర్రెలక్క
ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే
అయితే జ్వరం తగిలిందని వీడియో చేస్తే ఏమని అడగాలి.. జ్వరం తగ్గిందా? ఇప్పుడు ఎలా ఉంది.? టాబ్లెట్స్ వేసుకున్నారా .? అని అడగాలి అది కాకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. బేబీ ఆరోగ్యంగా ఉందా? బేబీ మూమెంట్స్ మంచిగా ఇస్తుందా.. అని కామెంట్స్ చేస్తున్నారు. నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా.. నా బేబీ ఆరోగ్యంగా ఉండేది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








