
Vakeel Saab: ప్రస్తుతం టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఫెస్టివల్ నడుస్తుంది అని డైరెక్టర్ క్రిష్ చెప్పినట్లుగా.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం బండ్ల గణేష్ స్పీచ్ ఫెస్టివల్ నడుస్తోంది. ఆదివారం జరిగిన వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన బండ్ల గణేష్.. మరోసారి తనకు పవన్ పై ఉన్న అభిమానాన్ని వర్ణిస్తూ.. దుమ్ములేపాడు.
ఏడు కొండల వాడికి అన్నమయ్య.. శివుడికి భక్తకన్నప్ప.. శ్రీరాముడికి హనుమంతుడు.. పవన్‌కల్యాణ్‌కు బండ్ల గణేశ్ అంటూ ఎంతో హుషారుగా చెప్పుకోచ్చాడు. పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం.. బూడిదయ్యేదాకా మనం వదలలేం. యనకు సక్సెస్ అలవాటు అయింది. అదొక శకం మాత్రమే అంటూ సినీ రచయితలు సైతం ఆశ్చర్యపోయేలా స్పీచ్ ఇచ్చాడు బండ్ల గణేష్. ఈయన స్పీచ్‌తో పవన్ అభిమానులకు మరింత జోష్ వచ్చింది. ఇక బండ్ల గణేష్ మాట్లాడుతున్నంతసేపు పవన్ అభిమానులు అరుపులు, కేకలతో శిల్పాకళా వేదిక మొత్తం మారుమోగింది. ఇక ఈ వేడుక అనంతరం బండ్ల గణేష్ స్పీచ్ సోషల్ మీడియాను కూడా ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. దీంతో యూట్యూబ్ ట్రెండింగ్‌లో బండ్ల గణేష్ స్పీచ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అటు పవన్ కళ్యాణ్ స్పీచ్ కంటే బండ్ల గణేష్ స్పీచ్‌నే ఎక్కువగా వినడానికి ఆసక్తి చూపిస్తున్నారనేది గమనార్హం. కేవలం యూట్యూబ్‌లోనే కాకుండా.. సోషల్ మీడియాలో సైట్లలో కూడా బండ్ల గణేష్ స్పీచ్ పై మీమ్స్.. కామెంట్స్ వస్తున్నాయి. పవన్ పై ఈయన పాడిన పద్యానికి ధీటుగా ఆయన అభిమానులు సరికోత్తగా పద్యాలను జతచేస్తున్నారు. “పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫంక్షన్ యందు బండ్ల గణేష్ స్పీచ్ వేరయా…. విశ్వదాభిరామా పవన్ కళ్యాణ్ మా దేవుడు” అంటూ కామెంట్స్ షేర్ అవుతున్నాయి.
ట్వీట్స్..