Bandla Ganesh: ‘మా’ క్లైమాక్స్.. బండ్ల గణేష్ ఆఖరి నిమిషంలో మాములు ట్విస్ట్ ఇవ్వలేదుగా.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌కి చేరింది. ఇంచుమించు క్లైమాక్స్‌కి వచ్చేసినట్టే. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది.

Bandla Ganesh: మా క్లైమాక్స్.. బండ్ల గణేష్ ఆఖరి నిమిషంలో మాములు ట్విస్ట్ ఇవ్వలేదుగా.
Bandla Ganesh

Edited By:

Updated on: Oct 10, 2021 | 10:25 AM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌కి చేరింది. ఇంచుమించు క్లైమాక్స్‌కి వచ్చేసినట్టే. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులున్నారు. 883 మందికి ఆదివారం ఓటు వేసే హక్కు ఉంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరుగుతుంది. ప్రతి ఓటరు 26 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.  సాయంత్రం నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఓట్లు దక్కించుకునేందుకు ప్యానల్స్ చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ‘మా’ ఎన్నికల ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ వస్తోన్న బండ్ల గణేశ్.. చివరి నిమిషంలో తన మార్క్ ట్వీట్ వేశారు. వివిధ పరిణామాల అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు ఫైనల్‌గా ప్రకటించిన బండ్ల గణేష్ చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మంచు విష్ణు ప్యానల్‌ నుంచి జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రఘు బాబుకు ఓటు వేయాలని కోరాడు. ‘మా సభ్యులకు విన్నపం దయచేసి మీ అమూల్యమైన ఓటు జనరల్ సెక్రెటరీగా రఘు బాబు వేసి గెలిపించ వలసినదిగా నా ప్రార్థన’ అని పేర్కొన్నాడు.

జీవితకు వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఫలితాలు ఎలా వస్తాయన్నది రేపు సాయంత్రం ఈ సమయానికి తేలిపోనుంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. రిజల్ట్స్ తర్వాత కూడా  వాడీ వేడీ మాటల యుద్దాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి నటీనటులు మా రాజ్‌ అంటూ ప్రకాష్ అంటూ జై కొడతారా? లేదంటే మంచు విష్ణుకే మార్కులు వేస్తారా? ఫిలింనగర్‌ సర్కిల్స్‌లోనే కాదూ తెలుగురాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ వర్గం ఆ వర్గం అని తేడాలేదు.. అందరూ మా ఎన్నికల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.

Also Read: ఛీ ఛీ.. మరీ ఇంత కక్కుర్తా.. చెప్పుల దొంగతనం.. షాప్ పెట్టుకుంటాడు కాబోలు

 భర్త ప్రాణంగా పెంచుకుంటున్న చేపను భార్య వేపుకుని తినేసింది.. ఎందుకంటే?

 

Loading...
Unable to load recommendations.
Follow Us