నందమూరి బాలకృష్ణ బిహేవియర్ గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుంటారు. బాలయ్య గోల్డ్ అని కొందరంటే, మొన్నేగా ఎవరినో కొట్టారట అని ఇంకొందరు నెట్టింట్లో డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. బయటివారి సంగతి సరే…. బాలయ్యతో స్క్రీన్‌ని పంచుకుంటున్న ప్రగ్య ఏమంటున్నారు? ప్రజెంట్ బీబీ 3లో నటిస్తున్న ప్రగ్య చేసిన ఇంట్రస్టింగ్ కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం.
ఫస్ట్ టైం బాలయ్యతో కలిసి నటిస్తున్న ప్రగ్యా… ఐ యామ్ సో హ్యాపీ అంటున్నారు. అంతేకాదు బాలకృష్ణ ఎనర్జీకే పవర్ హౌస్ లాంటి వారని.. బాలయ్యకు సినిమాపై ఉన్న ఫ్యాషన్ గురించి చెప్పలేమంటూ కితాబిస్తున్నారు. బాలయ్య సెట్‌లో ఉంటే ఆ ఎట్మాస్పియర్ అంతా ఫుల్ పాజిటివ్‌గా ఉంటుందంటున్నారు ప్రగ్యా జైస్వాల్. బీబీ 3లో ప్రగ్యా చేస్తున్న క్యారెక్టర్‌కు ఆమె ఫస్ట్ చాయిస్ కాదు. ముందు ప్రయాగా మార్టిన్, సాయేష సైగల్ లాంటి వాళ్లను ట్రై చేసిన మేకర్స్… ఫైనల్‌గా ప్రగ్యాను తీసుకున్నారు. అడపాదడపా తప్ప టాలీవుడ్‌లో పెద్దగా కనిపించని ఈ బ్యూటీ బాలయ్య సినిమాతో అయినా బిజీ అవ్వాలన్న ప్లాన్‌లో ఉన్నారు.
బాలయ్య అభిమానులపై చేయి చేసుకోవడంపై మరో వెర్షన్ కూడా ప్రచారంలో ఉంది. హీరోలు ఎక్కడికైనా వెళ్తే..అభిమానులు ఫోటోలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆరాటపడతారని.. ఆ సమయంలో పక్కనే ఉండే బౌన్సర్లు వారిని తోసివేయడం, నెట్టివేయడం చేస్తారు. అయితే బాలయ్య తన అభిమానులను వేరే వాళ్లు మిస్ బిహేవ్ చేయడం ఇష్టం లేక.. తానే కంట్రోల్ చేసుకోడానికే అలా కొడుతుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Also Read:
Telangana News: ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కారు… అరెరే ఏంటీ చిత్రం.. తెలుసుకుందాం పదండి
Crime News Telangana: నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో పని చేస్తున్న అధికారి.. అతగాడి చేతివాటం మీరే చూడండి