Unstoppable with NBK S4: నాకు బాసు ఆవిడే.. బాలయ్య చిలిపి ప్రశ్నకు బాబుగారి తెలివైన సమాధానం

|

Oct 25, 2024 | 9:03 PM

అన్ స్టాపబుల్ షోను బాలకృష్ణ తన ఎనర్జీతో సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ షోకు ఎంతో మంది స్టార్ హీరోలు హాజరయ్యారు. ఇక ఇప్పుడు సీజన్ 4కు మొదటి గెస్ట్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

Unstoppable with NBK S4: నాకు బాసు ఆవిడే.. బాలయ్య చిలిపి ప్రశ్నకు బాబుగారి తెలివైన సమాధానం
Unstoppable With Nbk
Follow us on

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ షో విజయవంతంగా నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది. మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షోను బాలకృష్ణ తన ఎనర్జీతో సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ షోకు ఎంతో మంది స్టార్ హీరోలు హాజరయ్యారు. ఇక ఇప్పుడు సీజన్ 4కు మొదటి గెస్ట్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూశారు. ఇక తొలి ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు గెస్ట్ గా హాజరు కావడంతో అన్ స్టాపబుల్ షోకి విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఇక తాజాగా సీజన్ 4 మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్  మొదలయ్యింది.

ఇది కూడా చదవండి : Tollywood : ఈ దెయ్యం పిల్ల అందానికి కుర్రాళ్ళు బలి.. మంటలు రేపుతున్న మసూద బ్యూటీ

మరోసారి బాలకృష్ణ తన ఎనర్జీతో హోస్ట్ గా ఆకట్టుకున్నారు. ఎక్కడ తగ్గని ఎనర్జీతో సీజన్ 4ను షురూ చేశారు బాలయ్య. ఇక తన ఎనర్జీతో గెస్ట్ లుగా వచ్చిన వారిని తికమక పెట్టె బాలకృష్ణ బాబు గారిని కూడా అలాంటి ప్రశాలతో ముంచెత్తారు. ఆ ప్రశ్నలకు చంద్రబాబు చాలా తెలివిగా సమాదానాలు చెప్పారు. షో స్టార్టింగ్ లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఓత్  అంటూ ఓ బుక్ పై చంద్రబాబుతో ప్రమాణం చేయించుకున్నారు. ఈ షోలో తాను అడిగే ప్రశాలకు బాలకృష్ణ పై ప్రేమతో సవ్వుతూ సమాధానం చెప్తాను అని చంద్రబాబుతో ప్రమాణం చేయించుకున్నారు బాలయ్య.

ఇది కూడా చదవండి :వామ్మో..! ఒంటరిగా చూస్తే భయంతో బకెట్ తన్నేస్తారు జాగ్రత్త.. దైర్యం ఉంటేనే చూడండి..

దానికి బాబు నేను సమయస్పూర్తితో  సమాదానాలు చెప్తాను అని నవ్వులు పూయించారు. అలాగే బాలయ్య మీద ఒట్టు కూడా వేయబోయారు బాబు. ఇక బాలకృష్ణ చంద్రబాబును తన ఫ్యామిలీ సంబందించిన ప్రశాలతో తికమక పెట్టె ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మా చెల్లెలితో ( చంద్రబాబు సతీమణి భవనేశ్వరి)తో చూసిన రొమాంటిక్ సినిమా ఒకటి చెప్పండి అని అడగ్గా.. నువ్వు మరీ క్రాస్ ఎగ్సామినేషన్ చేస్తున్నావ్ అని నవ్వుతు అన్నారు చంద్రబాబు. ఆతర్వాత  స్క్రీన్ పై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మరో పక్క బాలయ్య కూతురు బ్రాహ్మణి ఫోటోలు ఉంచి. ఈ ఇద్దరిలో ఇంట్లో ఎవరు బాస్.? అని ప్రశ్నించారు బాలకృష్ణ. దానికి చంద్రబాబు చాలా తెలివిగా భువనేశ్వరి నాకు బాసు.. బ్రాహ్మణి మా అబ్బాయికి బాసు అని అన్నారు చంద్రబాబు. దానికి బాలకృష్ణ అలా ట్రైనింగ్ ఇచ్చి పంపించాం అని అన్నారు. దాంతో షో లో నవ్వులు పూశాయి.

ఇది కూడా చదవండి : Mahesh Babu : మహేష్ పక్కన ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా .? అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.