Akhanda 2 Thaandavam : టీవీలో బాలయ్య ‘అఖండ 2 తాండవం’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

నందమూరి బాలయ్య, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అఖండ 2 తాండవం. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. గతేడాది చివరిలో రిలీజైన ఈ సినిమా బాలయ్య అభిమానులను బాగానే ఆకట్టుకుంది.

Akhanda 2 Thaandavam : టీవీలో బాలయ్య అఖండ 2 తాండవం.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Akhanda 2 Movie

Updated on: Apr 23, 2026 | 7:06 PM

వేసవి ఎండలు పెరుగుతున్న వేళ, ప్రేక్షకులకు ఉల్లాసాన్ని కలిగించే వినోదాన్ని పంచేందుకు జీ తెలుగు సిద్ధమైంది. ప్రతి ఇంట్లోనూ అద్భుతమైన సినిమా అనుభూతిని అందించాలనే లక్ష్యంతో, ఈ వేసవిలో ‘సమ్మర్ ఎంటర్టైన్మెంట్ బొనాంజా’ను అందిస్తోంది. ఇందులో భాగంగా, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బాలమురళీకృష్ణ (బాలకృష్ణ) కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) సైంటిస్ట్. శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియా పై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడి పై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఆ ఉద్రిక్త సంఘటనలను సృష్టించిన దుండగులపై అఖండ (బాలయ్య) ఎలా విరుచుకుపడ్డాడు ?, దేశాన్ని ఎలా కాపాడాడు ?, ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు ?, అఖండ తల్లి కోరిక తీరిందా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ తెలుగు వేదికగా ప్రసారమయ్యే అఖండ 2 చూడాల్సిందే!

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. సింహా, లెజెండ్, అఖండ వంటి వరుస ఇండస్ట్రీ హిట్లతో రికార్డులు తిరగరాసిన నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబో, అఖండ 2తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందించిన సంగీతం, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ఆధ్యాత్మిక యాక్షన్ విజువల్ వండర్‌కు ప్రాణం పోశాయి. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ని ఈ ఆదివారం మీరూ తప్పకుండా చూసేయండి! బాక్సాఫీస్  బ్లాక్ బస్టర్  హిట్ అఖండ 2, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!

ఇవి కూడా చదవండి

మరో మూడు రోజుల్లో..  జీ తెలుగులో బాలయ్య అఖండ 2 తాండవం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us