Venu Swamy: ఎంత బిజీగా ఉన్నా ఆ తెలుగు సినిమా పాటలు వింటే రిలాక్స్ అయిపోతా.. వేణు స్వామికి ఇష్టమైన సాంగ్స్ ఇవే

ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తలు, వివాదాల్లో నిలిచే వేణు స్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదేక్రమంలో తనకు ఇష్టమైన పాటలేంటో చెప్పుకొచ్చారు వేణు స్వామి.

Venu Swamy: ఎంత బిజీగా ఉన్నా ఆ తెలుగు సినిమా పాటలు వింటే రిలాక్స్ అయిపోతా.. వేణు స్వామికి ఇష్టమైన సాంగ్స్ ఇవే
Venu Swamy

Updated on: Nov 24, 2026 | 7:41 AM

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వివిధ ప్రముఖుల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయిపోయారాయన. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. . తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతానికి చెందిన హైదరాబాద్ లోనే చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలకు ముహూర్తాలు పెట్టారు. ఇదే క్రమంలో సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్టుతో వారి జాతకాలు చెప్పడం మొదలు పెట్టాడు. అన్నట్లు గతంలో ఒకటి రెండు సినిమాల్లో కూడా వేణు స్వామి నటించారు. మహేష్ బాబు అతడు సినిమాలో పూజారిగా కనిపించగా.. జగపతి బాబు సినిమాలోనూ పూజారిగా యాక్ట్ చేశారు. అయితే ఆ తర్వాత పూర్తి స్థాయి జ్యోతిష్యుడిగా మారిపోయారాయన. సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ మరింత పాపులర్ అయ్యాడు. అంతేకాదు స్టార్ సెలబ్రిటీలు సైతం వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మొదలు నిధి అగర్వాల్, డింపుల్ హయతీ, అషూ రెడ్డి.. ఇలా చాలా మంది స్టార్స్ వేణు స్వామిని నమ్ముతారు. ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటోన్న వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యరు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తన మ్యూజిక్ టేస్ట్, ఇష్టమైన పాటల గురించి మాట్లాడారు.

‘నాకు మొదటి నుంచీ కింగ్ కావడం కంటే కింగ్ మేకర్‌గా ఉండటమే ఇష్టం. వామాచారం, దశమహావిద్యల కోసం కామాఖ్య వెళ్లి వంద రోజుల దీక్ష చేశాను. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయం అవసరం లేదు. పోటీ వచ్చినప్పుడే మనిషిలోని అసలైన ప్రతిభ బయటపడుతుంది. నలుపు రంగు రాహువుకు సంకేతం. నా మొదటి కారును అమావాస్య రోజే కొన్నాను. నా దగ్గరకు వచ్చే ప్రముఖుల విషయాల్లో దాదాపు 99 శాతం సీక్రెట్ మెయింటేన్ చేస్తాను. చివరకు నా భార్యతో కూడా క్లయింట్ల విషయాలు పంచుకోను. ఇక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదు. భవిష్యత్తులో అసెంబ్లీ సీట్లు పెరిగితే నాకు, నా భార్యకు అవకాశాలు రావచ్చు.ఇక ఇంట్లో ఆడవాళ్లు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. నా భార్య వాణి, కూతురు నా కష్టాల్లో అండగా నిలిచారు. వారికి ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నా భార్య వాణి వీణ వాయిస్తుంటే ‘వెంకటాచలనిలయం’, ‘7/G బృందావన్ కాలనీ’, ‘ఆషికీ 2’ లాంటి సినిమా పాటలు వినడం నాకెంతో ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా ఈ పాటలు వింటే ఇట్టే రిలాక్స్ అయిపోతాను’ అని చెప్పుకొచ్చారు వేణు స్వామి.

ఇవి కూడా చదవండి

వేణు స్వామి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us