Jabardasth: జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్.. టెలికాస్ట్ రోజు, టైమింగ్స్ కూడా మారాయ్

తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ‘జబర్దస్త్’ కు మళ్లీ పునఃవైభవం తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జడ్జి నాగబాబు రీఎంట్రీ ఇచ్చారు. అలాగే మరికొందరు స్టార్ కమెడియన్లు కూడా ఈ షోకు తిరిగొచ్చారు. ఇక ఇప్పుడు ఏకంగా ఈ షో టెలికాస్ట్ సమయం, రోజు పూర్తిగా మారిపోయాయి.

Jabardasth: జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్.. టెలికాస్ట్ రోజు, టైమింగ్స్ కూడా మారాయ్
Jabardasth

Updated on: Jul 20, 2026 | 6:08 PM

గత పుష్కర కాలంగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది జబర్దస్త్ కామెడీ షో. టాప్ రేటింగ్స్ తో తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ షోకు బ్రాండ్ అంబాసిడర్స్ అయిన నాగబాబు, రోజా బయటకు వెళ్లి పోవడంతో ఈ షో రేటింగ్స్ తగ్గిపోయాయి. ఇక సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, వేణు.. ఇలా ఎంతో మంది ఆర్టిస్టులు సైతం ఈ షోకు దూరం కావడంతో జబర్దస్త్ కు పూర్ రేటింగ్స్ వచ్చాయి. అయితే మళ్లీ ఈ కామెడీ షోకు పునఃవైభవం తీసుకొచ్చేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జడ్జీగా నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చారు. గతంలోలాగే ఆయన ఫుల్ టైమ్ న్యాయ నిర్ణేతగా కొనసాగనున్నారు. అలాగే గతంలో ఈ షోకు వెన్నెముకగా నిలిచిన స్టార్ కమెడియన్లు సైతం ఈ షోకు తిరిగి వస్తున్నారు. ఇప్పటికే వినోద్ అలియాస్ వినోదిని ఈ షోలో నవ్వులు పండిస్తోంది. ఇక సినిమాల వల్ల జబర్దస్త్‌కు దూరమైన స్టార్ కమెడియన్ హైపర్ ఆది మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ లాగా కాకుండా పూర్తి స్థాయిలో ఈ షోలో పార్టిసిపేట్ చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆదినే వెల్లడించాడు. తాజాగా రిలీజైన జబర్దస్త్ ప్రోమోలోనూ ఆది ఫుల్ ఎనర్జీతో కనిపించాడు.

ఇక ఈ జబర్దస్త్ కామెడీ షో కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ షో టెలికాస్ట్ టైమింగ్స్ కూడా మారిపోయాయి. 13 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ జబర్దస్త్ షో మొదట్లో కేవలం గురువారం రాత్రి మాత్రమే వచ్చేది. ఆ తర్వాత ఆడియెన్స్ ఆదరణ పెరగడంతో గురు, శుక్రవారాల్లో ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’గా రూపాంతరం చెందింది. అనంతరం ఈ షోను శుక్ర, శనివారాలకు మార్చేశారు. ఇక ఇప్పుడు ఈ షోను ఏకంగా వీకెండ్ కు మార్చేశారు. అంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ జబర్దస్త్ షో స్టార్ట్ కానుంది. జూలై 26 ఎపిసోడ్ నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని స్పెషల్ ప్రోమో ద్వారా అధికారికంగా ప్రకటించారు షో నిర్వాహకులు. మరి ఈ అనూహ్య మార్పులతో జబర్దస్త్ రేటింగ్స్ పెరుగుతాయా? మళ్లీ ఈ షోకు పునఃవైభవం వస్తుందా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

హైపర్ ఆది వచ్చేశాడు.. ఇకపై ఫుల్ టైమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us