Arundhati: అరుంధతి మూవీలో ఈ దెయ్యం పాత్ర వేసిన పాపులర్ నటి ఎవరో తెలుసా..?

స్వీటీ అనుష్క శెట్టి నటించిన అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ దెబ్బతో సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అనుష్క. ది. దాదాపు 13 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాలో ఓ చోట దెయ్యం పాత్రను ఓ పాపులర్ నటి చేశారు.

Arundhati: అరుంధతి మూవీలో ఈ దెయ్యం పాత్ర వేసిన పాపులర్ నటి ఎవరో తెలుసా..?
Arundhati Movie

Updated on: Mar 09, 2026 | 12:43 PM

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం అరుంధతి. ఈ సినిమాలో అనుష్క యాక్టింగ్‌ పీక్‌లో ఉంటుంది. ప్రతినాయకుడు సోనూసూద్ సైతం అంతేస్థాయిలో తన పాత్రను పండించాడు. దర్శకుడు కోడి రామకృష్ణ తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటి. అంజి వంటి భారీ చిత్రం తర్వాత అరుంధతి తీయడం వల్ల ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేశారు. అనుష్క సినిమాలో పాత్ర కోసం సుమారు 10 కిలోల బరువున్న దుస్తులు ధరించి, ఉదయం ఆరింటికి మొదలుపెడితే డ్రెస్సింగ్ అయ్యేసరికి తొమ్మిది గంటలయ్యేదట. కత్తి పట్టుకుంటే, అదే మూడ్‌లో ఉండి, డైలాగ్‌లు ప్రాక్టీస్ చేస్తూ, భావోద్వేగంగా నటిస్తూ అనేకసార్లు కళ్ళు తిరిగి పడిపోయిందని మూవీ యూనిట్ చెబుతూ ఉంటారు. ఆ కష్టం ఎటూ పోలేదు సినిమా సంచలన విజయం సాధించింది.

అయితే అరుంధతి సినిమాలో అనుష్కను ఇంట్లోని రూమ్‌లో భయపెట్టే దెయ్యం పాత్రను ఓ ప్రముఖ నటి పోషించిన విషయం చాలామందికి తెలియదు. ఆ పాత్రను పోషించింది సీనియర్ యాక్ట్రస్ జయలలిత. ఆ సీన్ షూట్ చేయడానికి ఏకంగా పది రోజులు పట్టిందని జయలలిత చెప్పారు. ఆ పాత్ర కోసం వేసిన మేకప్ కారణంగా తన స్కిన్, హెయిర్ డ్యామేజ్ అయినట్లు వెల్లడించారు. ఆ పాత్రకు మేకప్ కోసం బాంబే నుంచి మేకప్ మ్యాన్‌ను పిలిపించారని.. మేకప్ వేయడానికి 3 గంటలు అయితే.. తీయడానికి 6 గంటలు పట్టినట్లు ఆమె వివరించారు. దర్శకుడు కోడి రామకృష్ణ కృషి ఫలితంగానే ఆ పాత్ర అంత బాగా వచ్చిందని వివరించారు.

Jayalalitha

Follow Us