anushka shetty: బరువు తగ్గనున్న బాహుబలి బ్యూటీ.. సన్నజాజిలా మారనున్న స్వీటీ..

|

May 20, 2021 | 3:23 PM

రీసెంట్‌గా చబ్బీ చీక్స్‌తో తళుక్కున మెరిసి నెట్టింట హంగామా చేసిన అనుష్క.. ఇక ఇప్పుడు ఉన్నపళంగా వర్కౌవుట్లు షూరూ చేసిందట.

anushka shetty: బరువు తగ్గనున్న బాహుబలి  బ్యూటీ.. సన్నజాజిలా మారనున్న స్వీటీ..
Follow us on

anushka shetty: రీసెంట్‌గా చబ్బీ చీక్స్‌తో తళుక్కున మెరిసి నెట్టింట హంగామా చేసిన అనుష్క.. ఇక ఇప్పుడు ఉన్నపళంగా వర్కౌవుట్లు షూరూ చేసిందట. రీసెంట్‌గా ఒప్పుకున్న ఓ సినిమా కోసం మాక్సిమమ్ తగ్గాలని చూస్తోందట. తగ్గడమే కాదు.. ఆ సినిమాలో నటిస్తున్న కుర్ర హీరోను.. పర్సనాలిటీలో మ్యాచ్‌ చేయాలని తెగ ట్రై చేస్తుందట. నవీన్ పొలిశెట్టి హీరోగా.. మహేష్‌ డైరెక్షన్లో.. యూవీ క్రియేషన్ బ్యానర్లో ఓ సినిమా తెరకెక్కనుందట. 40 ఏళ్ల మహిళ్కు 20 ఏళ్ల కుర్రాడికి మధ్య నడిచే లవ్‌ స్టోరీగా.. డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందట.

అయితే ఈ స్టోరీ నచ్చడంతో సినిమా చేయడానికి ఇప్పటికే అంగీకరించిన అనుష్క శెట్టి.. ఇప్పుడు తన వెయిట్ను తగ్గించడానికి కష్ట పడుతోందట. నిశబ్దం సినిమా తరువాత ఎలాంటి సినిమాలు చేయకుండా ఇంటికే పరిమితం అయిన జేజమ్మ.. ఇంకాస్త లావయ్యిందట. అదీకాక రీసెంట్‌గా సోషల్ మీడియాలో మెరిసిన అనుష్క ఫోటోలు కూడా ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దీంతో ఈ లాక్‌ డౌన్‌ టైంని యుటిలైజ్‌ చేసుకుని లావు తగ్గాలని చూస్తుందట ఈ బ్యూటీ. అంతేకాదు పీలగా ఉన్న నవీన్‌ పొలిశెట్టి పక్కన మరీ.. ఇంత లావుగా కనిపిస్తే బాగోదని ఫీలై… తాను ఆరితేరిన యోగాసనాలనే.. ఓ రేంజ్‌లో వేస్తుందట. ఇదే కనుక నిజం అయితే అనుష్క మెరుపు తీగలా మారి.. మన జాతిరత్నం కంటే ఎక్కవ మెరవడం ఖాయం కదూ..!

మరిన్ని ఇక్కడ చదవండి :

లక్కీ ఛాన్స్ అందుకున్న బాలీవుడ్ హీరోయిన్.. హాలీవుడ్‏ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. పవర్‏ఫుల్ పాత్రలో బ్యూటీ..

Srikanth Addala: బెల్లంకొండను డైరెక్ట్ చేయబోతున్న నారప్ప డైరెక్టర్.. శ్రీకాంత్ అడ్డాల చేతికి కర్ణన్ రీమేక్..?

Pawan Kalyan: దూకుడు పెంచిన పవర్ స్టార్.. పవన్ కొత్త సినిమా కోసం భారీ కాలేజ్ సెట్..