తెలుగు బిగ్ బాస్-4 : ఆ ఇద్ద‌రు భామ‌లు ఫిక్స్ !

|

Aug 07, 2020 | 7:50 PM

తెలుగులో ‘బిగ్ బాస్’ మూడు సీజన్లు అదిరిపోయే హిట్ అయ్యాయి. త్వరలో నాలుగో సీజన్ ప్రారంభించేందుకు షో నిర్వాహకులు ప్లానింగ్ సిద్దం చేశారు.

తెలుగు బిగ్ బాస్-4 : ఆ ఇద్ద‌రు భామ‌లు ఫిక్స్ !
Follow us on

Bigg Boss Telugu : తెలుగులో ‘బిగ్ బాస్’ మూడు సీజన్లు అదిరిపోయే హిట్ అయ్యాయి. త్వరలో నాలుగో సీజన్ ప్రారంభించేందుకు షో నిర్వాహకులు ప్లానింగ్ సిద్దం చేశారు. ఇప్ప‌టికే హెస్ట్ నాగార్జున‌తో ప్రోమో షూట్ కంప్లీట్ చేశారు. కోవిడ్ నేప‌థ్యంలో కంటెస్టెంట్లు అందరికీ ముందుగా టెస్టులు చేయించి..ఆ త‌ర్వాత హెమ్ క్వారంటైన్‌లో ఉంచిన అనంత‌రం బిగ్ బాస్ ఇంట్లోకి పంపించ‌నున్నారు. ఏర్పాట్లు వ‌డివ‌డిగా జ‌రుగుతుండ‌టంతో బిగ్ బాస్ షోలో ఎవ‌రెవ‌రు పాల్గొనబోతున్నార‌న్న అంశంపై ఆస‌క్తి నెల‌కుంది. కాగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం యాంక‌ర్ లాస్య, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ క‌మ్ మోడ‌ల్ దివ్య పేర్లు ఫైన‌ల్ అయిన‌ట్లు తెలుస్తోంది. మ‌రికొంద‌రి పేర్లు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ వారి విష‌యంలో స్ప‌ష్ట‌త రాలేదు. కాగా ఈ షో ప్రారంభ తేదీని కొద్దిరోజుల్లో ప్రకటించనున్నారు.

 

Read More : భారీ ధ‌ర‌కు అమ్ముడైన‌ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ శాటిలైట్ రైట్స్ !