Anasuya Bharadwaj: అందాల అనసూయను మేకప్ లేకుండా ఎప్పుడైనా చూశారా..? వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటో

|

Nov 25, 2022 | 5:29 PM

ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో ద్వారా అనసూయ చాల పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది.

Anasuya Bharadwaj: అందాల అనసూయను మేకప్ లేకుండా ఎప్పుడైనా చూశారా..? వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటో
Anasuya Bharadwaj
Follow us on

బుల్లి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో అనసూయ ఒకరు. ఈ అమ్మడి అందం గురించి.. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో ద్వారా అనసూయ చాల పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. అందం అభినయం ఉన్న ఈ భామ చాలా సినిమాల్లో సహాయక పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అనసూయకు అవకాశాలు వెల్లువెత్తాయి. అలాగే ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోనూ నటించింది ఈ అమ్మడు. ఈ మూవీలో నెగిటివ్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇక అనసూయ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే.

ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన పై నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి తన స్టైల్ లో కౌంటర్లు ఇస్తుంది ఈ చిన్నది.

తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. మేకప్ లేకుండా నేచురల్ లుక్ లో దర్శనమిచ్చింది అను. ఈ అందమైన ఫొటోతో పాటు నిన్నే పెళ్లాడతా సినిమాలోని పాటలోని లిరిక్స్ రాసుకొచ్చింది. “మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా.. నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న.. నా మనసు తేలేదెలా.. గిలిగింత పెడుతున్న.. నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం ” అంటూ రాసుకొచ్చింది అను. ఈ ఫోటో చూస్తుంటే ఆ లిరిక్స్ ఈ అందాల భామకోసమే రాశారా అన్నటు ఉన్నాయి. ఈ ఫోటో పై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అను అందమైన ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..