Jani Master: ‘నేను ఆ బాధితురాలితో కలిసి పని చేశాను.. న్యాయం జరగాలి’.. జానీ మాస్టర్ కేసుపై అనసూయ కామెంట్స్

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వస్తోన్న లైంగిక ఆరోపణలు టాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్‌ షూటింగ్‌లకి వెళ్లినప్పుడు జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదును పరిగణణలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Jani Master: 'నేను ఆ బాధితురాలితో కలిసి పని చేశాను.. న్యాయం జరగాలి'.. జానీ మాస్టర్ కేసుపై అనసూయ కామెంట్స్
Jani Master, Anasuya
Follow us

|

Updated on: Sep 18, 2024 | 5:09 PM

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వస్తోన్న లైంగిక ఆరోపణలు టాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్‌ షూటింగ్‌లకి వెళ్లినప్పుడు జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదును పరిగణణలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ కోరుతున్నారు. తాజాగా ఈ కేసుపై స్టార్ యాంకర్ అనసూయ స్పందించింది. బాధితురాలికి జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఆమె లేడీ కొరియోగ్రాఫర్ కు న్యాయం జరగాలని కోరింది. ‘అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలి. మహిళలకు సానుభూతి అవసరం లేదు. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాటిని ధైర్యంగా ప్రతిఘటించాలి. మీకు అందరూ అండగా నిలబడుతారనే విషయం మర్చిపోకూడదు. నేను బాధిత యువతితో కలిసి కొద్ది రోజులు వర్క్ చేశాను’.

‘పుష్ప’ సెట్స్ లో రెండు, మూడుసార్లు ఆ అమ్మాయిని చూశాను. కానీ తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. ఆ అమ్మాయికి మంచి ట్యాలెంట్ ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆ అమ్మాయి ట్యాలెంట్ ను ఏమాత్రం తగ్గించలేవు. కానీ, మనసులో దాచుకుని బాధ పడటం వల్ల ఎవరికీ ఎలాంటి లాభం ఉండదు. నా వర్క్ ప్లేస్ లో తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే స్పందిస్తాను. వారికి మద్దతుగా నిలబడుతాను. ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను’ అని అనసూయ తెలిపింది.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్, ప్లే బ్యాక్ సింగర్ జానీ మాస్టర్ కేసుపై  స్పందించారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరారు.

పూనమ్ కౌర్ ట్వీట్..

సింగర్ చిన్మయి పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!