అందంలో అప్సర.. సోయగంలో కిన్నెర ఈ భామ.. స్టన్నింగ్ కోమలి..
18 September 2024
Battula Prudvi
24 ఆగస్ట్ 1995న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించింది కోమలి ప్రసాద్. కర్ణాటకలోని బళ్లారిలో పెరిగింది.
ఆమె అహ్మద్‌నగర్‌లోని ప్రవర ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డెంటిస్ట్రీని అభ్యసించింది. దాని తర్వాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమపై తనకు ఆసక్తి పెరిగింది.
2016లో నేను సీతాదేవి అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత 2017లో నెపోలియన్ సినిమాలో కనిపించింది.
తర్వాత 2020లో అనుకున్నది ఒకటి అయినది ఒకటిలో కనిపించింది. 2022లో కిరణ్ అబ్బవరంకి జోడిగా సెబాస్టియన్ పి.సి. 524 అనే సినిమాలో నటించింది.
ఆమె వెబ్ సిరీస్ లూజర్‌లో, ఫైండింగ్ యువర్ పెంగ్విన్‌లో, మోడరన్ లవ్ హైదరాబాద్ అనే ఆంథాలజీ సిరీస్‌లో కూడా కనిపించింది.
తర్వాత అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన హిట్ 2 ది సెకండ్ కేస్ సినిమాలో వర్ష అనే ఓ పోలిస్ ఆఫీసర్ పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఈ ఏడాది శశివదనే అనే ఓ తెలుగు ప్రేమ కథలో కథానాయకిగా నటించింది. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ వయ్యారి సోషల్ మీడియాలో బాగా ఫేమస్. చేసింది తక్కువ సినిమాలైన ఈ ముద్దుగుమ్మకి కుర్రాళ్లలో ఫాలోయింగ్ చాల ఎక్కువగానే ఉంది.