ఆ అవసరం లేదు.. కూతురు విషయంలో దీపిక కీలక నిర్ణయం..!
18 September 2024
Basha Shek
బాలీవుడ్ అందాల జోడి దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ ఇటీవల అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే
దీపికా పదుకొణె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తమ కూతురి ఆలనా పాలనలో బిజీగా ఉన్నారీ లవ్లీ కపుల్.
కాగా బిడ్డ పుట్టక ముందే ముంబైలో ఒక ఖరీదైన ప్రాంతంలో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసింది దీపికా పదుకొణె.
ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన బాంద్రాలో ఒక ఇంటిని కొనుగోలు చేసిన దీపిక ఇందుకోసం భారీగా ఖర్చు చేసింది.
దీపికా పదుకొణె తన కూతురి కోసం ఈ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని కోసం ఆమె రూ.17.78 కోట్లు చెల్లించింది.
కాగా తన కూతురి పెంపకం విషయంలో దీపిక పదుకొణె ఓ బలమైన నిర్ణయాన్ని తీసుకుందట. అదేంటంటే..
సాధారణంగా సెలబ్రిటీలూ.. తమ పిల్లల్ని చూసుకునేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించి ఆయాలను నియమిస్తుంటారు.
అయితే దీపిక మాత్రం తన కూతురిని తానే పెంచుతానని, ఎవరి సహాయం అవసరంలేదని గట్టిగా చెబుతోందట.
ఇక్కడ క్లిక్ చేయండి..