ఒకప్పుడు ఆయన కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన హీరో. కానీ ‘పుష్ప’గా బాక్సాఫీస్ వద్ద తగ్గేదే లే అంటూ గర్జించిన తర్వాత, ఇప్పుడు ఆయన రేంజ్ ఖండాంతరాలు దాటిపోయింది. ఇప్పటికే జపాన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ఆ మెగా హీరో.. ఇప్పుడు ఇండియన్ సినిమా గర్వించదగ్గ ఒక అగ్ర దర్శకుడితో చేతులు కలపబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన కేవలం తెలుగు డైరెక్టర్లతోనే పనిచేశారు. కానీ ఇప్పుడు తన రూట్ మార్చి కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరినీ తన కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు. అద్భుతమైన విజువల్స్, భారీ సెట్టింగ్స్, ప్రాణం పెట్టే డ్రామాతో సినిమాలు తీసే ఆ బాలీవుడ్ దర్శకుడు.. ఈ ఐకాన్ స్టార్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు?
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ బాలీవుడ్ లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో విజువల్ వండర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన మొదటి హిందీ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో గట్టి సమాచారం వినిపిస్తోంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఇప్పటికే లాక్ అయిందని తెలుస్తోంది.
సంజయ్ లీలా భన్సాలీ అంటేనే గ్రాండ్ విజువల్స్ కు మారుపేరు. భారీ స్కేల్, ఇంటెన్స్ డ్రామాతో కూడిన సినిమాలు తీయడంలో ఆయన సిద్ధహస్తులు. అలాంటి దర్శకుడు అల్లు అర్జున్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ తో సినిమా చేస్తున్నారంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఒక విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారట. ‘పుష్ప’తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన బన్నీ.. ఇప్పుడు నేరుగా హిందీ సినిమాతో అక్కడ తన మార్కెట్ ను మరింత విస్తరించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అల్లు అర్జున్ ప్రస్తుతం కేవలం తెలుగు డైరెక్టర్లకే పరిమితం కాకుండా పరభాషా దర్శకులపై కూడా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన తన 22వ సినిమాను తమిళ అగ్ర దర్శకుడు అట్లీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తన 23వ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా తమిళ దర్శకులతో సినిమాలు అనౌన్స్ చేస్తున్న బన్నీ.. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేయబోతున్నారు.
అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఆయన క్రేజ్ మరింత పెరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే హిందీలో రూ. 800 కోట్ల వసూళ్లు సాధించిన ఘనత బన్నీకి ఉంది. ఇప్పుడు నేరుగా సంజయ్ లీలా భన్సాలీ వంటి దిగ్గజ దర్శకుడితో సినిమా చేస్తే అక్కడ ఆయన నంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ కనుక హిట్ అయితే మాత్రం బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ రికార్డుల రారాజు అయిపోవడం ఖాయం. మరి ఈ భారీ విజువల్ వండర్ తో ఐకాన్ స్టార్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. అల్లు అర్జున్ ఎంచుకుంటున్న దర్శకులను చూస్తుంటే ఆయన టార్గెట్ గ్లోబల్ లెవల్ లో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. అట్లీ, లోకేష్ కనకరాజు, ఆపై సంజయ్ లీలా భన్సాలీ.. ఇలా వరుసగా స్టార్ డైరెక్టర్లతో ఆయన చేయబోయే యుద్ధం టాలీవుడ్ కు గర్వకారణం.