Pushpa Movie: అన్నీ భాషల్లో అదరగొడుతున్న ఐకాన్ స్టార్ “సామీ సామీ” సాంగ్..

|

Oct 30, 2021 | 5:38 PM

పుష్ప సినిమా కోసం బన్నీ ఫాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ గా కనిపించనున్నాడు.

Pushpa Movie: అన్నీ భాషల్లో అదరగొడుతున్న ఐకాన్ స్టార్ సామీ సామీ సాంగ్..
Pushpa
Follow us on

Pushpa Movie: పుష్ప సినిమా కోసం బన్నీ ఫాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ గా కనిపించనున్నాడు. తాజాగా పుష్ప నుంచి మరో పాట విడుదలైంది. మేకర్స్ ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన విశేషాలను అభిమానుల ముందుంచుతున్నారు. దానికి తోడు అల వైకుఠ‌పురంలోలాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ‘సామి సామి’ అంటూ సాగే మూడో సింగిల్ వచ్చేసింది. ఈ సాంగ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాటను విడుదల చేశారు. ఈ పాట అన్నిభాషల్లో దూసుకుపోతుంది ఈ పాట. ఇప్పటికే తెలుగులో 13 మిలియన్ వ్యూస్ ను దాటింది ఈ పాట. అన్నిభాషల్లో సామీ సామీ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. పక్కా మాస్ అవతారంలో అటు అల్లు అర్జున్. ఇటు రష్మిక మందన్న కనిపిస్తున్నారు. న్యాచురల్ లుక్స్‌తో కట్టి పడేస్తున్నారు ఈ ఇద్దరూ. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ritu Varma: రితూ వర్మ లేటెస్ట్ ఫోటో షూట్.. అదరహో అనిపిస్తోన్న వరుడు కావలెను భామ

Deepthi Sunaina: చిలిపిగా కవ్విస్తున్న బిగ్ బాస్ బ్యూటీ… దీప్తి సునయన లేటెస్ట్ పిక్స్

Puneeth Rajkumar: పెండింగ్‌ సినిమాలెన్ని.. శాండిల్‌వుడ్‌కు ఎంత నష్టం .. ఊహించగలరా..