
పుష్ప పుష్పరాజ్ తగ్గేదే లే.. అంటూ థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయ్యాడు… నేడు (17న )విడుదల అవుతుంది. తెలంగాణలో పుష్ప సినిమాకు 5 షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల అయ్యింది. ముందునుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలై ట్రైలర్ సినీ ప్రేక్షకులకు కట్టి పడేసింది. సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ’ సంచలనం సృష్టించింది. ఈ మాస్ బీట్‌కు ఫిదా అవుతున్నారు.
కోవిడ్ టైమ్‌లో డిజిటల్ సూపర్ స్టార్‌గా ఎదిగిన నటుడు ఫాహద్ ఫాజిల్. అప్పటి వరకు మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఫాహద్.. లాక్ డౌన్ టైమ్‌లో నేషనల్ లెవల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు హీరోగానే చేస్తూ వచ్చిన ఈ మలయాళ టాప్ హీరో పుష్ప సినిమా కోసం రూత్‌లెస్ విలన్‌గా మారారు. ఇక థియేటర్స్ దగ్గర సందడి మొదలైంది. అభిమానులు అర్ధరాత్రి నుంచే థియేటర్స్ దగ్గర పండగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు.
సినిమా: పుష్ప ది రైజ్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా
నిర్మాత: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫాహద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ, అజయ్, అజయ్‌ఘోష్, అనసూయ, రావు రమేష్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, రుబెన్
కెమెరా: మిరోస్లా కూబా బ్రొజెక్
రచన, దర్శకత్వం: సుకుమార్
విడుదల: 17.12.2021
ఈరోజు విడుదలైన పుష్ప మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పుష్ప సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అల్లు అర్జున్ నటనకు భాషా బేధం లేకుండా అందరూ ఫిదా అవుతున్నారు. బన్నీ నటనకు ఉత్తరాది ప్రేక్షకుల సలాం కొడుతున్నారు. పుష్పరాజ్‌గా ఊరమాస్ పాత్రలో బన్నీ అదరగొట్టాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప. ఈరోజు విడుదలైన ఈసినిమా భారీ రెస్పాన్స్ అందుకుంది. పుష్ప చిత్రయూనిట్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పుష్ప సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ట్వీట్..
థియేటర్లలో పుష్ప రాజ్ సందడి చేస్తున్నాడు. భారీ స్థాయిలో విడుదలైన పుష్ప మూవీ మాస్ జాతర్ కొనసాగిస్తోంది. అల్లు అర్జున్ నటనకు.. సుకుమార్ డైరెక్షన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని..
ట్వీట్..
థియేటర్లలో పుష్ప సినిమా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ప్రేమకథలతో ఎంటర్టైన్ చేసిన కాంబినేషన్ ఇప్పుడు ఊరమాస్ కథాంశంతో మెప్పించారు. ఓ వైపు థియేటర్లలో పుష్ప రాజ్ రచ్చ చేస్తుండగా.. నెట్టింట్లో పుష్ప డైలాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. పార్టీ లేదా పుష్పా వంటి డైలాగ్స్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
అల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఈరోజు విడుదలైన పుష్ప మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుంది. థియేటర్లలో పుష్ప మాస్ జాతర కనిపిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ చేస్తున్నారు.
ఓవైపు థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరోవైపు సమంత స్పెషల్ సాంగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ లిరిక్స్‌కు పూర్తి ఆపోజిట్లో.. ఉన్న లిరిక్స్‌తో వచ్చిన ఓ పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్ప సినిమాలోని లిరిక్స్‌కు కౌంటర్‌గా ఈ పాటని రాశారా అనేతంలా ఉన్నాయి. అవేంటో ఓసారి వినండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నటించిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ.. ఓ వైట్ పేపర్ పెన్సిల్ తో చేతిలో గొడ్డలి పట్టెకుని పుష్పరాజ్ పాత్రని తలపించేలా గీతలు గీసిన అయాన్ `పుష్ప` రిలీజ్ (17-12-2021) ఆల్ ద బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ` అని విషెస్ తెలియజేశాడు. ఈ ఫొటోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన బన్నీ ఆనందంతో మురిసిపోయాడు. `థ్యాంక్యూ సోమచ్ నా చిన్ని బాబు. ఐ లవ్యూ మై అయాన్. ఈ కార్డ్ తో ఈ ఉదయాన్ని నాకెంతో ప్రత్యేకంగా మలిచావు` అని తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ఆకట్టుకుంటోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ సూపర్ హిట్ టాక్ సంపాందిచుకుంది. ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ట్వీట్..
హిందీలోనూ అదరగొడుతున్న పుష్ప రాజ్.. డైరెక్షన్, పర్ఫామెన్స్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డ్యాన్స్, యాక్షన్ అదిరిపోయాయంంటూ కామెంట్స్..
ట్వీట్..
అల్లు అర్జున్.. రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప సినిమా ఈరోజు విడుదలైంది. ఉదయం నుంచి థియేటర్లలో బన్నీ ఫ్యాన్స్ సందడి మొదలైంది. ఈ క్రమంలో ఎస్వీసీ రంజనీ శివరంజనీ థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్.. థియేటర్ల గేట్లను సైతం దూకి లోపలికి ప్రవేశిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోస్‌ను గోల్డ్ మైన్స్ టేలీఫిల్మ్స్ ట్వి్ట్టర్ ఖాతా షేర్ చేయగా.. పుష్పచిత్రయూనిట్ రీట్వీట్ చేసింది.
అల్లు అర్జున్ పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది.
ట్వీట్..
ఇప్పుడే పుష్ప సినిమాను చూశాను. కమర్షియల్ సినిమాలో క్యారెక్టర్ స్టడీ ఫార్మాట్ చాలా అరుదు. సుకుమార్ సర్, అల్లు అర్జున్ బాయ్ హ్యాట్సాఫ్. మీ అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకదాన్ని అందించిన అల్లుఅర్జున్ భాయ్..
ట్వీట్..
థియేటర్లలో పుష్పరాజ్ దుమ్మురేపుతున్నాడు. ఉదయం నుంచి పుష్ప థియేటర్ల వద్ద బన్నీ అభిమానుల సందడి మాములుగా లేదు. పాన్ ఇండియా వైడ్ మాస్సివ్ రెస్పాన్స్.. హృదయపూర్వక శుభాకాంక్షలు బన్నీ అన్న అంటూ విష్ చేశారు హీరో నాగశౌర్య.
ట్వీట్..
చూట్టూ ఉన్న బన్నీ బాక్సర్స్… అండ్ పోలీసులను కూడా లెక్కచేయకుండా… వారు కంట్రోల్‌కు అందకుండా బన్నీ చూడడం కోసం ఆరాట పడ్డారు ఫ్యాన్స్. అయితే బన్నీ… దీన్నంతా సీరియస్ గా తీసుకోకుండా చిరునవ్వుతో… అందరికీ కనిపించారు.
సినిమా చూసేందుకు థియేటర్ కు వచ్చిన అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయలేదు బన్నీ ఫ్యాన్స్. ఆయన కార్ చుట్టూ చేరి బన్నీని చూసేందుకు… సెల్ఫీ తీసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.
ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ సంధ్య థియేటర్ లో సినిమా వీక్షించారు. అల్లు అర్జున్ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.
హిందూపురంలో పుష్ప సినిమా షో లేటుగా స్టార్ట్ చేశారని అభిమానులు ఆందోళనకు దిగారు.. థియేటర్ వద్ద గందగోళ పరిస్థితిని క్రియేట్ చేశారు. థియేటర్ పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు..
లేడీస్ కూడా పుష్ప సినిమా కోసం థియేటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అంటూ నినాదాలు చేస్తున్నారు ఫ్యాన్స్..
విశాఖపట్నంలో అల్లు అర్జున్ అభిమానులు సందడి చేస్తున్నారు ఉదయం నుంచి థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్. బెనిఫిట్ షో వేయకపోవడంతో కాస్త నిరాశపడ్డారు అల్లు అర్జున్ అభిమానులు. ఇక ఇప్పడు మార్నింగ్ షో స్టార్ట్ అవవడంతో అభిమానులు క్యూ కట్టారు..
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్.. టపాసులు పేల్చుతూ హంగామా చేస్తున్న ఫ్యాన్స్..
సినిమా కిరాక్ ఉంది అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.. ”పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్” అంటూ డైలాగులు చెప్తున్నా ఫ్యాన్స్..
అల్లు అర్జున్ ఫోటోలకు దండలేసి కొబ్బరికాయలు కొడుతున్నారు ఫ్యాన్స్.. అలాగే మరికొంతమంది ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు.
రచ్చ రచ్చ చేస్తున్న అల్లు అర్జున్ అభిమానులు.. థియేటర్స్ దగ్గర బన్నీ ఆర్మీ హంగామా చేస్తున్నారు. అల్లు అర్జున్ కటౌట్స్ కు ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు ఫ్యాన్స్.
పుష్పసినిమా సందర్భంగా.. అభిమానుల సందడి చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫొటోలతో.. ఫ్లేక్సిలతో ర్యాలీలు చేస్తున్నారు..
పుష్ప రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు సందడి చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో బన్నీ ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు.. జై బన్నీ నినాదాలతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్..
అర్ధరాత్రి నుంచే మొదలైన అభిమానుల సందడి.. థియేటర్స్ వద్ద పండగ వాతావరణం..