Allu Arjun: వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ వివాహం గ్రాండ్ గా జరిగింది. శుక్రవారం (మార్చి 06) జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ లో నయనిక మెడలో మూడు ముళ్లు వేశాడు శిరీష్. కాగా అల్లు అర్జున్ పెళ్లి రోజే అల్లు శిరీష్ వివాహం కూడా జరగడం విశేషం.

Allu Arjun: వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో
Allu Arjun

Updated on: Mar 07, 2026 | 10:18 PM

అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్- నయనిక రెడ్డిల పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. శుక్రవారం (మార్చి 05)న హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు శిరీష్ గ్రాండ్ వెడ్డింగ్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా అల్లు అర్జున్ పెళ్లి రోజే అల్లు శిరీష్ కూడా పెళ్లిపీటలెక్కడం విశేషం. దీంతో అల్లు శిరీష్ దంపతులతో పాటు అల్లు అర్జున్ దంపతులకు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తాయి. 2011లో పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్- స్నేహా రెడ్డి శుక్రవారం 15 వ వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్.. తన భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. పెళ్లిరోజును పురస్కరించుకుని తన భార్యకు విషెస్ చెప్పడంతో పాటు బెంజ్ ఏఎమ్‌జీ మోడల్ కారుని బహుమతిగా ఇచ్చాడు బన్నీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

కాగా ప్రస్తుతం మార్కెట్‌లో బెంజ్ ఏఎమ్‌జీ మోడల్ కారు ధర సుమారు రూ.4-5 కోట్ల మధ్యన ఉందని తెలుస్తోంది. కాగా అల్లు అర్జున్- స్నేహా రెడ్డి లది ప్రేమ వివాహం. 2011లో వీరి వివాహం జరగింది. ఇప్పుడు వీళ్లకు అయాన్, అర్హ అని పిల్లలు ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు లోకేశ్ కనగరాజ్‌తోనూ ఓ మూవీ కమిట్ అయ్యాడు బన్నీ. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమాల నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us