Allu Arjun: ఇది మరుపురాని ప్రయాణం.. జీవితంలో ప్రత్యేకమైన రోజు.. అల్లు అర్జున్ ఎమోషనల్..

ఊర మాస్ రగ్గడ్ లుక్‏లో స్మగ్లర్ పాత్రలో తన నటవిశ్వరూపం చూపించాడు బన్నీ. ఇక ఈ సినిమాలోని మ్యూజిక్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. సామీ.. సామీ.. పాట దగ్గర్నుంచి.. ఊ అంటావా.. ఊహు అంటావా పాట వరకు ప్రతి ఒక్క సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మొట్ట మొదటి హీరోగా రికార్డ్ సృష్టించారు. ఇక ఇప్పుడు బన్నీ నటిస్తోన్న పుష్ప 2 సినిమాపై భారీ హైప్ నెలకొంది.

Allu Arjun: ఇది మరుపురాని ప్రయాణం.. జీవితంలో ప్రత్యేకమైన రోజు.. అల్లు అర్జున్ ఎమోషనల్..
Allu Arjun
Follow us

|

Updated on: Mar 29, 2024 | 6:56 AM

పుష్ప సినిమాతో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మారిపోయింది. ఈ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప రాజ్ పాత్రలో ఆయన మేనరిజం.. యాక్టింగ్ స్టైల్‏కు విదేశీయులు సైతం ముగ్దులయ్యారు. ఊర మాస్ రగ్గడ్ లుక్‏లో స్మగ్లర్ పాత్రలో తన నటవిశ్వరూపం చూపించాడు బన్నీ. ఇక ఈ సినిమాలోని మ్యూజిక్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. సామీ.. సామీ.. పాట దగ్గర్నుంచి.. ఊ అంటావా.. ఊహు అంటావా పాట వరకు ప్రతి ఒక్క సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మొట్ట మొదటి హీరోగా రికార్డ్ సృష్టించారు. ఇక ఇప్పుడు బన్నీ నటిస్తోన్న పుష్ప 2 సినిమాపై భారీ హైప్ నెలకొంది. గతంలో రిలీజ్ అయిన పుష్ప చిత్రాన్ని మించి ఉంటుందని భావిస్తున్నారు అడియన్స్. ఓవైపు ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న బన్నీ.. తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈరోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజు అని.. దాదాపు 21 సంవత్సరాల మరుపురాని ప్రయాణం అంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా ?.. బన్నీ హీరోగా వెండితెరకు పరిచయమైన రోజు. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా గంగోత్రి రిలీజ్ అయిన రోజు. అలాగే ఇదే రోజున అటు దుబాయ్ లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ లో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

“ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.. నా మొదటి సినిమా గంగోత్రి 2003లో ఇదే రోజున విడుదలైంది. ఇప్పుడు ఇదే రోజు నా మైనపు విగ్రహాన్ని దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నా.. నా 21 సంవత్సరాల సినీ కెరీర్ ఒక మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతతజ్ఞుడను… ముఖ్యంగా నా అభిమానులకు అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరూ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

దుబాయ్ లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిన్న బన్నీ స్వయంగా తన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీ ఐకానిక్ స్టైల్ తరహాలో బన్నీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. పుష్ప 2 తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు బన్నీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.