
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 8). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. గంగోత్రి సినిమాతో హీరోగా మొదలైన సినీ ప్రయాణం.. ఇప్పుడు పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్ కు చేరింది. తండ్రి అల్లు అరవింద్ అగ్ర నిర్మాత, మేనమామ చిరంజీవి సుప్రీమ్ హీరో కావడంతో సినీరంగ ప్రవేశం సులభమని భావిస్తారు అంతా. ఆయనకు ఎర్రటి తివాచీ పరిచినట్లే ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ నిశితంగా గమనిస్తే ఆ వారసత్వం ఇచ్చే ‘అవకాశం’ కంటే అది మోపే ‘బాధ్యత’ , ‘ఒత్తిడి’ చాలా ఎక్కువని అర్థమవుతుంది. 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఆ సినిమా అవకాశం రావడం సులభమే అయ్యుండవచ్చు. అయితే, ఆ సినిమా విడుదలైన తర్వాత ఆయన ఎదుర్కొన్న విమర్శలు తక్కువ కాదు.
ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..
అప్పట్లో ఆయన రూపంపై, నటనపై చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేశారు. కేవలం ‘వారసత్వం’ వల్లే హీరో అయ్యాడనే విమర్శలు వచ్చాయి. కానీ ప్రతి సవాలును ఎదుగుదలకు మార్చుకుంటూ విమర్శలు స్వీకరిస్తూ తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంచుకుంటూ నటుడిగా విమర్శకుల మనసులు గెలుచుకున్నారు. పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు.
ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..
గతంలో ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. హీరోగా తన సినీప్రయాణం అంత సులభంగా సాగలేదని అన్నారు. సినిమా కుటుంబం, నాన్న ప్రొడ్యూసర్, హీరోగా అరంగేట్రం సులభంగానే జరిగిందా అనే ప్రశ్నకు అల్లు అర్జున్ స్పందిస్తూ.. చదువు పూర్తి కాగానే పెద్ద బ్యానర్ లో తనకు అవకాశం వచ్చిందని అన్నారు. కానీ తాను బాలేనని రిజెక్ట్ చేశారని తెలిపారు. దీంతో తండ్రి, మేనమామ చిరంజీవి ఇద్దరూ ఫీలయ్యారని… అదే సమయంలో రాఘవేంద్రరావు 100వ సినిమా ప్రపోజల్ వచ్చిందని అన్నారు. నాన్న, అశ్వనీదత్, చిన్ని కృష్ణ అందరూ కలిసి ఆ ప్రాజెక్ట్ చేశారు. గంగోత్రి సినిమాతో హీరోగా నన్ను పరిచయం చేశారు. నటుడిగా ఫెయిల్.. చిన్నప్పటి నుంచి ఫెయిల్యూరే.. మళ్లీ ఫెయిల్యూరా అనుకున్నా. తర్వాత సినిమాలు రావు అనుకున్నా.. అందుకే నటుడిగా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నించా.. విజయం సాధించా అని అన్నారు. నాకు నటనే బలం. దానిమీదనే ఫోకస్ చేశానని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Kota Srinivas Rao: చాలా మంది నటులు ఉన్నారు.. కానీ ఆ హీరోకు ఉన్న సత్తా ఎవరికీ లేదు.. కోట శ్రీనివాస రావు..
ఆర్య మూవీతో అల్లు అర్జున్ కెరీర్ మారిపోయింది. ఈ మూవీ తర్వాత స్టైలీష్ స్టార్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఆర్య, సరైనోడు, రేసుగుర్రం, అల వైకుంఠపురంలో.. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Babu Mohan: స్టార్ హీరోలను సైతం లెక్క చెయ్యదు.. ఎవరినీ పట్టించుకోదు.. ఆమెలా ఎవరూ బతకలేరు.. బాబూ మోహన్ కామెంట్స్..