Viral Photo: నెలన్నర క్రితం ప్రసవం.. అప్పుడే నెక్ట్స్ లెవల్ వర్కవుట్స్.. ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా..?

|

Dec 25, 2022 | 3:43 PM

డెలివరీ అయిన ఒకటిన్నర నెల అవుతుంది అంతే. అప్పుడే ఆమె శరీరంపై దృష్టి పెట్టింది. తనను తాను మానసికంగా, శారీరకంగా ధృడపరుచకుంటుంది.

Viral Photo: నెలన్నర క్రితం ప్రసవం.. అప్పుడే నెక్ట్స్ లెవల్ వర్కవుట్స్.. ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా..?
Actress Workout Photo
Follow us on

ఈ ఇయర్ ఆలియాకు చాలా స్పెషల్ అని చెప్పాలి. రణబీర్‌కపూర్‌‌ను మ్యారేజ్ చేసుకుని.. వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ టాలెంటెడ్ బ్యూటీ..  ఇటీవలే ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రజంట్ మాతృత్వపు మాధుర్యాన్ని అస్వాదిస్తుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.  ప్రసవానంతరం వర్కవుట్స్ స్టార్ట్ చేసినట్లు ఆలియా పేర్కొంది. వ్యాయామంలో భాగంగా తలకిందులుగా వేలాడుతున్న ఫొటోను షేర్ చేసింది.  “బిడ్డకు జన్మనిచ్చిన  ఒకటిన్నర నెల తర్వాత నేను నా బాడీపై ఫోకస్ పెట్టారు. నా టీచర్ సాయంతో వర్కువుట్స్ ప్రారంభించాను. మనం మన శరీరానికి కావాల్సిన కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డెలివరీ తర్వాత నేను కొన్ని రోజులు కేవలం వాకింగ్‌, ప్రాణాయామం మాత్రమే చేశాను. ఇప్పుడు నా ట్రైనర్‌ సాయంతో ఇలా ఆసనాలు వేస్తున్నాను. ఇంకా చేయాల్సింది బోలెడంత ఉంది. ఈ ఇయర్ నా శరీరం ఎప్పుడూ చేయనంత కష్టం పడింది. అయితే, బేబీకి లైఫ్ ఇవ్వడం అనేది ఓ మధురమైన అనుభూతి. మన శరీరాన్ని మనం లవ్ చేయడం అనేది దానికి మనం ఇచ్చే గౌరవం” అంటూ అలియా భట్‌ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చింది.

అయితే ఆలియా కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పింది. అందరి శరీరాలు ఒకే మాదిరిగా ఉండదని.. వ్యాయామాన్ని ప్రారంభించే ముందు నిపుణుల సజీషన్స్ తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట ట్రెండ్ మారింది. ‘బై మిస్టేక్ నువ్వు ఫొటోను రివర్స్‌లో పోస్ట్‌ చేశావనుకున్నా..’ అని అలియా పోస్ట్‌కు సోనూసూద్‌ ఇచ్చిన ఫన్నీ రిప్లై సైతం వైరల్ అవుతుంది. ఇక ఈ ఫొటో చూసిన ఆలియా ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ‘క్వీన్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సినిమాల విషయానికొస్తే కరణ్‌జోహార్‌ మూవీ ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’లో అలియా నటించింది. అలాగే హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ అనే మూవీతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.