
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ఎంటర్‌టైనర్ మరో వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న భారీ వినోదాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ మారింది. తొలుత ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ప్రేక్షకులకు సంపూర్ణ వినోదానుభూతిని అందించాలనే ఉద్దేశంతో చిత్ర విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. వినోదం, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
#AadarshaKutumbam will be taking a little more time to deliver the entertainment and experience we have promised you. The film will now release worldwide on 9th OCT ❤️
We know the wait has been a little longer than expected and we sincerely apologise for the delay 🙏
First… pic.twitter.com/ydePAw6ElS
— Naga Vamsi (@vamsi84) September 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.