Actress : మూడు పెళ్లిళ్లు.. మూడుసార్లు విడాకులు.. కారణం బయటపెట్టిన హీరోయిన్..

తెలుగులో ఒక్క సినిమాతోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ ఆ తర్వాత మరో మూవీ చేయకుండా సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న ఆమె.. అటు వ్యక్తిగత జీవితంతోనూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. తాజాగా ఆమె తన మూడు పెళ్లిళ్లు, విడాకుల గురించి అసలు విషయం బయటపెట్టింది.

Actress : మూడు పెళ్లిళ్లు.. మూడుసార్లు విడాకులు.. కారణం బయటపెట్టిన హీరోయిన్..
Vanitha Vijay Kumar

Updated on: Aug 05, 2026 | 1:40 PM

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో సుపరిచితమైన నటి వనితా విజయకుమార్. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన వివాహాలు, విడిపోవడం, అలాగే తల్లిగా తన ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలోని ఎత్తుపల్లాలను, వాటి నుండి నేర్చుకున్న పాఠాలను వివరంగా వెల్లడించారు. వనితా విజయకుమార్ తన జీవితంలో మూడు ముఖ్యమైన సంబంధాలను కలిగి ఉన్నారు. తన మొదటి వివాహం గురించి ప్రస్తావిస్తూ, తనకు విజయ్ శ్రీ హరి అనే కుమారుడు, జోవిక అనే కుమార్తె ఉన్నారని తెలిపారు. కుమారుడు విజయ్ శ్రీ హరి 22 సంవత్సరాల వయస్సువాడని, లండన్‌లో ఫిలిం మేకింగ్ కోర్సు పూర్తి చేసి తిరిగి వచ్చాడని, త్వరలో సినీ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని వనిత పేర్కొన్నారు. కుమార్తె జోవిక వయస్సు 18 అని, ఆమె ముంబైలోని అనుపమ్ ఖేర్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో డిప్లమా పూర్తి చేసిందని, నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. తన తండ్రి (విజయకుమార్) అడుగుజాడల్లో తన పిల్లలు ఇద్దరూ సినీ రంగంలో తమ భవిష్యత్తును వెతుకుతున్నారని చెప్పడానికి వనిత సంతోషం వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

తన రెండవ వివాహం గురించి మాట్లాడుతూ, అది పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయమని, ఆ సంబంధం విషపూరితమైనది కాదని వనిత వివరించారు. ఆ వివాహం ద్వారా తనకు ఒక కుమార్తె కూడా జన్మించిందని తెలిపారు. అయితే, కుటుంబ సభ్యుల జోక్యం, కస్టడీ సమస్యల కారణంగా ఆ సంబంధం కొనసాగలేదని ఆమె వెల్లడించారు. ఆ సమయంలో ఎదురైన సవాళ్లు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని, చివరికి ఇద్దరికీ మంచిది కాదని భావించి విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. విడిపోయినప్పటికీ, తల్లిదండ్రులుగా తమ బిడ్డ కోసం మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నామని వనిత తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

పీటర్ పాల్‌తో తన మూడవ సంబంధం గురించి.. అది పెళ్లి కాదని, కేవలం నిశ్చితార్థం లాంటిదని వనిత స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఎదురైన ఒత్తిడి, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక పరిస్థితి (“నేను చనిపోతున్నాను అనుకున్నాను, చనిపోయే ముందు నాకు తోడుగా ఎవరైనా ఉండాలి అనిపించింది”) ఈ సంబంధానికి దారితీసిందని ఆమె వివరించారు. అయితే, ఆ అనుభవం తన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని, దాని నుండి తాను ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు. అది తనను వ్యక్తిగా ఎదగడానికి, తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించడానికి ప్రేరణనిచ్చిందని చెప్పారు. పీటర్ పాల్ మంచి వ్యక్తి అయినప్పటికీ, సమాజం నుండి వచ్చిన ఒత్తిళ్లు, అతని కుటుంబం నుండి తలెత్తిన సమస్యల కారణంగా తాను తన జీవితాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని, అతను వేరే మార్గాన్ని ఎంచుకున్నాడని ఆమె పేర్కొన్నారు. ప్రేమ ముఖ్యమైనదే అయినప్పటికీ, ప్రేమించే వ్యక్తి తిరిగి ప్రేమను అందించడం, ఆ ప్రేమకు అర్హుడై ఉండటం అవసరమని వనిత నొక్కి చెప్పారు. “నేను నా భర్తను ప్రేమిస్తున్నాను, నేను సర్దుకుపోతున్నాను, నేను రాజీ పడుతున్నాను” అని మహిళలు తమ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదని, ఎవరికి వారే ముందు తమను తాము చూసుకోవాలని ఆమె సూచించారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

వనీతా విజయ్ కుమార్..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Loading...
Unable to load recommendations.
Follow Us