
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరు అబ్బో.. ఈ అమ్మడికి అప్పట్లో ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. ఎంతో మంది స్టార్స్ తో కలిసి నటించి అలరించారు సిమ్రాన్. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది. ఎంతోమంది ఫెవరేట్ హీరోయిన్ సిమ్రాన్. జీరో సైజ్ నడుముతో కుర్రకారును కట్టిపడేసింది. అద్భుతమైన నటనతో పాటు ఆహా అనిపించే అందంతో మెప్పించింది సిమ్రాన్. యంగ్ హీరోల దగ్గర నుంచి అగ్రహీరోల వరకు అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది సిమ్రాన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సిమ్రాన్. స్టార్ హీరోలు కూడా అప్పట్లో ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూసేవారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించింది ఈ క్రేజీ బ్యూటీ.
ప్రస్తుతం సిమ్రాన్ టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో సిమ్రాన్ చివరిగా జాన్ అప్పారావ్ 40ప్లస్ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత టాలీవుడ్ లో నటించలేదు. కానీ హిందీలో అడపాదడపా కనిపిస్తూ ఉంటుంది. అలాగే తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు సిమ్రాన్. ఇటీవల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించింది. అలాగే సోషల్ మీడియాలోనూ సిమ్రాన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా సిమ్రాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. హిందీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు సిమ్రాన్. చాలా సార్లు నాకు హిందీ సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి కానీ నేను నో చెప్పాను. ఎందుకో బాలీవుడ్ వాళ్ళతో నాకు సరైన కమ్యూనికేషన్ కుదరదు. ఇక్కడ మేము సంపాదించుకున్న పేరును, మాకున్న లెగసీని వారు అస్సలు గుర్తించరు. మేము కొత్తవాళ్ళలాగా.. ఇప్పుడే ఇండస్ట్రీకి వాచినట్టు మాతో వ్యవహరిస్తుంటారు. అది నాన్ని చాలా ఇబ్బందిపెట్టింది అని సిమ్రాన్ అన్నారు. సినిమాలే ప్రాణంగా పని చేసే మాలాంటి వారిని అక్కడ కనీస గౌరవం కూడా దక్కదు. అది నన్ను చాలా బాధపెట్టింది. అక్కడ వసతి సౌకర్యాల దగ్గర కూడా బేరాలు ఆడతారు. మాతో వచ్చే స్టాఫ్ ను కూడా తగ్గించాల్సి వస్తుంది. హోటల్ గదులు, విమాన టిక్కెట్ల విషయంలోనూ రాజీ పడమంటారు. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు కానీ, ఒక నటిగా ఇవి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. వాళ్ళు మనపై ఆధిక్యం చూపాలని చూస్తారు.. అది నాకు నచ్చలేదు అందుకే నేను అక్కడ సినిమాలు చేయలేదు అని సిమ్రాన్ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.