Meena : హీరోయిన్ మీనా కుటుంబంలో కరోనా కలకలం.. కొత్త అతిథి వచ్చిందంటూ ఇంట్రస్టింగ్ ట్వీట్..

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. క్రమక్రమంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది.

Meena : హీరోయిన్ మీనా కుటుంబంలో కరోనా కలకలం.. కొత్త అతిథి వచ్చిందంటూ ఇంట్రస్టింగ్ ట్వీట్..
Meena

Updated on: Jan 05, 2022 | 2:30 PM

Meena : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. క్రమక్రమంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమా తారలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన మీనా కుటుంబం కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా పంచుకున్నారు. ఈ న్యూ ఇయర్‌లో తొలిసారిగా సోషల్‌ మీడియాలోకి వచ్చిన మీనా ఓ బ్యాడ్‌ న్యూస్‌ తో అభిమానులను పలకరించారు. తన కుటుంబంలోకి ఓ కొత్త అతిథి వచ్చిందంటూ మీనా సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి.బాధ్యతగా ఉండండి అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు మీనా. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన మీనా ప్రస్తుతం తల్లి, సహానటి పాత్రలు చేస్తున్నారు. అయితే  మీనా సోషల్‌ మీడియాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!

Megastar Chiranjeevi: సేనాపతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రాజేంద్రప్రసాద్ నటనపై ఆసక్తికర కామెంట్స్..

Pushpa: ఇట్స్ అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us