
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మధుబాల. రోజా సినిమాతో దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా “రోజా” సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అందాల తార, ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, ఆరోగ్యం , అందం రహస్యాలను పంచుకున్నారు. ఆమె తన కెరీర్, తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న అనుబంధం, సుదీర్ఘ విరామం తరువాత తిరిగి సినిమాల్లోకి రావడానికి గల కారణాలను వెల్లడించారు. మధుబాల తన అందం, ఆరోగ్యం వెనుక ఉన్న “మర్మం” గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆమె ప్రకారం, “నేను ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తింటాను. సాదాసీదా ఆహారాన్ని ఇష్టపడతాను. నాకు ఆకలి లేనప్పుడు, ఎంత రుచికరమైన ఆహారమైనా సరే, నేను తినను.” ఈ నియమం తనను తేలికగా, చురుకుగా ఉంచడంలో సహాయపడుతుందని ఆమె వివరించారు. దీనితో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తల్లిదండ్రుల నుండి లభించిన మంచి జన్యువులు కూడా తన అందానికి కారణమని ఆమె చెప్పారు.
1991లో విడుదలైన “రోజా” సినిమాతో మధుబాల దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ఏఆర్ రెహమాన్ సంగీతానికి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. తెలుగులో మధుబాల నటించిన చిత్రాలు తక్కువే అయినా, అవి అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వాటిలో “అల్లరి ప్రియుడు”, “చిలక్కొట్టుడు” (జగపతి బాబుతో), “గణేష్” (వెంకటేష్ తో), “ఆవేశం” (డా. రాజశేఖర్ తో) వంటివి ముఖ్యమైనవి. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన “ఆవేశం” సినిమాను కూడా ఆమె ప్రస్తావించారు.
తన తెలుగు చిత్రాలలో “అల్లరి ప్రియుడు” సినిమా అంటే తనకు చాలా ఇష్టమని మధుబాల తెలిపారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు తన హీరోయిన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, వారిని తెరపై గ్లామరస్ గా చూపించడంలో సిద్ధహస్తులని ఆమె అన్నారు. అంతకు ముందు సీరియస్ రోల్స్ చేసిన తాను, రాఘవేంద్రరావు గారి సినిమాలో రంగులమయంగా, అందంగా కనిపించడం ఎంతో నచ్చిందని చెప్పారు. ఈ చిత్రంలో తన స్నేహితురాలు రమ్యకృష్ణ కూడా నటించారని, షూటింగ్ సమయంలో ఎంతో సరదాగా గడిచిందని గుర్తు చేసుకున్నారు. “ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి” పాట తనకు చాలా ఇష్టమని ఆమె చెప్పారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood: చాలా టార్చర్ చేశారు.. ట్రైన్లో నుంచి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..
ఎక్కువమంది చదివినవి : నవ్వులు పంచిన నటుడి జీవితంలో విషాదం.. గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..