Laya : ఈ రెండు పనులు చేస్తే ఏజ్ అస్సలు కనిపించదు.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్ లయ..

Updated on: Jul 02, 2026 | 1:11 PM

హీరోయిన్ లయ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వయస్సు కనిపించకుండా, ఎంతో ఫిట్‌గా ఉండటానికి గల రహస్యాలను పంచుకున్నారు. జిమ్ కన్నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, డ్యాన్స్‌లే తనను చురుకుగా ఉంచుతాయని ఆమె తెలిపారు. లయస్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులతో కలిసి చేసే ఈ డ్యాన్స్ కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా, సానుకూల శక్తిని, ఆనందాన్ని ఇస్తాయని ఆమె వెల్లడించారు.

1 / 5
సినీ నటి లయ ఒకప్పుడు కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు విరామం ఇచ్చింది. అయితే ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే..  తన వయస్సు కనిపించకుండా, నిత్యం చురుకుగా, ఫిట్‌గా ఉండటానికి గల రహస్యాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కేవలం నటీనటులు మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆమె చెప్పుకోచ్చారు. ఫిట్‌నెస్ అనేది కేవలం అందం కోసం కాదని, ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులను దూరం చేసుకోవడానికి అత్యవసరమని లయ చెప్పారు.

2 / 5
పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టాక చాలా మంది మహిళలు తమ శరీరంపై శ్రద్ధ వహించడం మానేస్తారని లయ అన్నారు. ఒకానొక సమయంలో తాను కూడా "నా పని అయిపోయింది, నన్ను ఎవరు చూస్తారులే" అని భావించానని, కొత్త బట్టలు కూడా కొనుక్కోలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే, కాలక్రమేణా వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, మనం ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలని ఆమె గ్రహించారు. "మనము ఫిట్‌నెస్ లేకపోతే డిసీజెస్ ఇంకా ఫాస్ట్ గా వస్తాయి, ఎటాక్ అవుతాయి, ఓల్డ్ ఏజ్ ఎక్కువ ఫాస్ట్ గా వస్తుంది" అని ఆమె హెచ్చరించారు. శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల వృద్ధాప్యాన్ని కొంత కాలం పాటు వాయిదా వేయవచ్చని ఆమె అన్నారు.

3 / 5
జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేయడం కన్నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం డ్యాన్స్‌లు చేయడం తనకు మరింత ఆసక్తిని, ప్రేరణను ఇస్తుందని లయ తెలిపారు. జిమ్‌ను వాయిదా వేయడానికి వర్షం, ఎండ, పిల్లలు వంటి అనేక సాకులు వెతుకుతానని, కానీ రీల్స్ విషయంలో అలా ఉండదని ఆమె సరదాగా చెప్పారు. లయస్ డ్యాన్స్ అకాడమీ పేరుతో డ్యాన్స్ స్కూల్ నడుపుతున్న లయ, తన విద్యార్థులతో కలిసి ఈ రీల్స్‌ను రూపొందిస్తారు. ఈ విద్యార్థులు ఇప్పుడు ఆమెకు సన్నిహితులైన స్నేహితులుగా మారారు.

4 / 5
 వీరంతా రెండు గంటల దూరంలో ఉన్నప్పటికీ, ఒకే రకమైన సానుకూల ఆలోచనలు కలిగి ఉండటం వల్ల వారితో కలిసి డ్యాన్స్ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని లయ వెల్లడించారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, సరదాగా గడుపుతూ, వారం రోజుల పని ఒత్తిడిని వీకెండ్‌లో ఇలాంటి కార్యకలాపాలతో తొలగించుకుంటామని ఆమె తెలిపారు. ఇది అలసటను ఇవ్వకుండా, మళ్లీ వారం మొత్తం పనిచేయడానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుందని ఆమె అన్నారు.

5 / 5
లయ కేవలం మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఇదే సందేశం ఇచ్చారు. 40 ఏళ్లు రాగానే "ఇంకేముందిలే, అయిపోయింది" అని భావించి, ఆరోగ్యంపై శ్రద్ధ వదిలేసే పురుషులు చాలా మంది ఉన్నారని ఆమె అన్నారు. అయితే, ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నప్పటికీ, తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం అవసరమని లయ చెప్పారు. "ఈట్ హెల్తీ అండ్ వర్కౌట్ చేసుకుంటే, మనము యాక్టివ్ గా ఉంటే, ఎప్పుడు కొంచెం మనము ఇంకా యంగ్ గా కనిపిస్తాం. అండ్ హ్యాపీగా ఉండాలి" అని ఆమె సూచించారు.

Follow Us