Kangana Ranaut: వెండి కప్పుల్లో నీళ్లు తాగిన కంగన.. నెట్టింట విమర్శలు.. రీజన్ చెప్పి నోళ్లు మూయించిన నటి

బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఆమె పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో కంగనా రనౌత్ బిజీ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే కంగనా రనౌత్‌కు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

Kangana Ranaut: వెండి కప్పుల్లో నీళ్లు తాగిన కంగన.. నెట్టింట విమర్శలు.. రీజన్ చెప్పి నోళ్లు మూయించిన నటి
Kangana Ranaut
Follow us

|

Updated on: Aug 21, 2024 | 12:50 PM

బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఆమె పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో కంగనా రనౌత్ బిజీ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే కంగనా రనౌత్‌కు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇందులో ఆమె వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ కనిపించడం వివాదానికి దారి తీసింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘పేదలతో ఉన్నానని కంగనా రనౌత్ చెబుతోంది, కానీ ఆమె వెండి కప్పుల్లో నీరు తాగుతుంది’ అని కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే తాను ఎందుకు వెండి కప్పుల్లో ఎందుకు నీళ్లు తాగుతున్నానో గతంలో ఫుల్ గా క్లారిటీ ఇచ్చింది కంగనా. ‘వెండి కప్పులో నీళ్లు తాగితే రోగాలు దూరమవుతాయి. శరీరంలోని విషపూరిత పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. వెండి కప్పుల్లో నీటిని తాగడం వల్ల పలు జబ్బులు దూరమవుతాయని మా అమ్మ చెప్పింది’ అంటూ గతంలో ఒక పోస్టును షేర్ చేసింది కంగనా. దీంతో విమర్శకులు కాస్త వెనక్కు తగ్గారు.

కంగనా రనౌత్ చాలా కాలంగా బాలీవుడ్‌లో హీరోయిన్ గా వెలుగొందుతోంది. అయితే సినిమాలతో పాటు వివాదాల్లో నిలవడం ఆమెకు పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా కంగనా రనౌత్ ఎప్పుడూ కొంతమంది బాలీవుడ్ స్టార్స్ ను విమర్శిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం కంగనా రనౌత్ నటుడు రణబీర్ కపూర్‌పై విమర్శలు చేసింది. కంగనా రనౌత్ మాటలు విని జనాలు కూడా షాక్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కంగనా నటించి దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు కంగనా.

ఇవి కూడా చదవండి

అందుకే వెండి గ్లాసులో నీళ్లు తాగుతా..

కంగనా రనౌత్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.