Kangana Ranaut: భారత్‌ను చెడుగా చూపించే సినిమాలనే ఆస్కార్ సెలెక్ట్ చేస్తుంది.. మరోసారి కంగనా కామెంట్స్

|

Jan 08, 2025 | 8:48 PM

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఉండాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు మోక్షం కలిగింది. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్, ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా జనవరి 17న విడుదల కానుంది.

Kangana Ranaut: భారత్‌ను చెడుగా చూపించే సినిమాలనే ఆస్కార్ సెలెక్ట్ చేస్తుంది.. మరోసారి కంగనా కామెంట్స్
Kangana Ranaut
Follow us on

కంగనా రనౌత్నిత్యం  వివాదాలతో సావాసం చేస్తూ ఉంటుంది. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆస్కార్‌ అవార్డ్స్ పై వివాదాస్పద కామెంట్స్ చేసింది. భారత్ నుంచి ఆస్కార్ పోటీకి ఎంపికయ్యే చిత్రాల ఎంపిక ఎలా జరుగుతుందో కంగనా వివరించింది. మన దేశాన్ని చెడుగా చూపించే చిత్రాలను ఆస్కార్‌కు ఎంపిక చేస్తారని కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది. కిరణ్ రావు దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన ‘లపాటా లేడీస్’ చిత్రం ఈ ఏడాది ఆస్కార్ పోటీకి భారత్ నుంచి ఎంపికైంది. ఇప్పుడు కంగనా నటించిన ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 17న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఆస్కార్ అంశాన్ని లేవనెత్తింది.

ఇది కూడా చదవండి : 8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

‘సాధారణంగా ఆస్కార్‌కి భారతదేశం గురించి వేరే ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఓ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. నేను కూడా దాని గురించి ఉత్సాహంగా ఉన్నాను. భారతదేశంలో చాలా మత అసహనం ఉందని, మనం కోరుకున్న విధంగా ప్రేమను వ్యక్తపరచలేమని ఆ సినిమా దర్శకుడు చెప్పడం విన్నాను. నేను ఇంకా ఈ సినిమా చూడలేదు. భారత్‌ను చెడుగా చూపించే సినిమాలనే ఆస్కార్ సెలెక్ట్ చేస్తుందని కంగనా అన్నారు.

ఇది కూడా చదవండి : కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..! దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురు గత్తర లేపిందిగా..!

కానీ ఎమర్జెన్సీ సినిమా అలా కాదు. ఇప్పుడు భారత్ ఎలా ఉంటుందో చూసేందుకు పశ్చిమ దేశాలు సిద్ధమయ్యాయి. అవార్డుల గురించి నాకు చింత లేదు. నేను భారతీయ, పాశ్చాత్య అవార్డుల గురించి కూడా ఆలోచించను. సినిమాను బాగా చేశాం. కంగనా తన సినిమా  అంతర్జాతీయ సినిమాల క్వాలిటీతో సమానంగా ఉందని ప్రశంసించింది. కంగనా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి