Jayasudha: హీరోలంటే ఇష్టముండేది కాదు.. ఆ క్రికెటర్ అంటే పిచ్చి.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా: జయసుధ

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు జయసుధ. తనదైన అందం, సహజ నటనతో 'సహజ నటిగా' ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికీ సినిమాలు చేస్తోన్న ఈ సీనియర్ హీరోయిన్ సహాయక నటిగా ఆడియెన్స్ ను అలరిస్తున్నారు.

Jayasudha: హీరోలంటే ఇష్టముండేది కాదు.. ఆ క్రికెటర్ అంటే పిచ్చి.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా: జయసుధ
Actress Jayasudha

Updated on: Oct 11, 2026 | 4:20 PM

సహజ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం 12 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారీ అందాల తార. తమిళ దర్శక దిగ్గజం కే. బాలచందర్ దర్శకత్వంలో అరంగేట్రం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జయసుధ తన అందం, అభినయంతో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కథానాయికగా, వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో కంటతడి పెట్టించారీ అందాల తార. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత సహాయక నటిగానూ మెప్పించారు జయసుధ. స్టార్ హీరోలు, హీరోయిన్లకు అమ్మగా, అత్తమ్మగా, వదినగా నటించి మెప్పించారు సినిమాల సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్ స్టార్ జితేంద్ర సోదరుడు నితిన్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జయసుధ. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిలో చిన్న కుమారుడు శ్రేయాన్ హీరోగానూ నటించారు. 2017లో జయసుధ భర్త చనిపోయారు. ఆయన మరణం తర్వాత సినిమాలు బాగా తగ్గించుకున్నారు జయసుధ. కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా క్రికెట్ పట్ల తనకెంతో అభిమానం ఉండేదో చెప్పుకొచ్చారు.

‘క్రికెట్ అంటే నాకు పిచ్చి.. క్రికెట్ మ్యాచ్‌లు బాగా చూసేదాన్ని. చెన్నైలో మా ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే చెపాక్ స్టేడియం ఉండేది. దానిని ఇప్పుడు అంతా చిదంబరం స్టేడియం అంటున్నారు. దీంతో మ్యాచ్ లు ఉన్నప్పుడల్లా స్టేడియంకు వెళ్లేదాన్ని. అన్నం తినకపోయినా మా అమ్మ క్రికెట్‌ని చూపిస్తూ ముద్ద తినిపించేది. మొన్న చెన్నై వెళ్లినప్పుడు కూడా స్టేడియంను చూశాను’ అని పేర్కొన్నారు జయసుధ. ఇదే ఇంటర్వ్యూలో వయసులో ఉన్నప్పుడు ఎవరిమీదైనా క్రష్ ఉందా? అని అడిగిన ప్రశ్నకు జయసుధ ఇలా సమాధానం చెప్పుకొచ్చారు. మొదట కొందరు తెలుగు హీరోలపై కొంతకాలం క్రష్ ఉండేది. కానీ నాకు క్రికెటర్లంటే పిచ్చి.. ఎవరో ఒక క్రికెటర్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. 15 ఏళ్ల వయసు నుంచే తెలియకుండానే ఒకరిని ఇష్టపడతాం. ఆ రోజుల్లో మా కజిన్స్‌కి 16 ఏళ్లకే పెళ్లిళ్లు చేసేశారు.దీంతో నాతో ఆడుకోవడానికి ఎవరూ లేరు. పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ని పెళ్లి చేసుకోవాలని మనసులో ఉండేది. అలాగే ఇండియన్ స్టార్ క్రికెటర్ రవిశాస్త్రి అంటే కూడా చాలా ఇష్టం. ఇక నా కో- స్టార్స్ మీద ఏ ఇష్టం ఉండేది కాదు. హిందీ ఆర్టిస్ట్స్ అంటే ఇష్టం. మన చుట్టూ ఉన్న వాళ్లకంటే అందుబాటులో లేనివాళ్లు, కలవడానికి ఛాన్స్ లేనివాళ్లు, హాలీవుడ్‌లో ఉండేవాళ్లని వెళ్లి కలవాలని ఉండేది. కొంతమంది సింగర్స్ గొంతు విన్నప్పుడు కూడా వాళ్లని పెళ్లి చేసుకోవాలని ఉండేది’ అని జయసుధ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సీనియర్ నటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us