Hema : అమ్మబాబోయ్.. హేమ కూతుర్ని చూశారా..!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు హేమ. తన నటనతో తోపాటు నవ్వులు పూయించి మెప్పించారు హేమ.. సహాయక పాత్ర అంటే ముందు గుర్తుకు వచ్చే పేర్లలో హేమ మొదటి వరసలో ఉంటారు. కోవై సరళ తర్వాత ఆ రేంజ్‌లో కామెడీ పండించారు హేమ.

Hema : అమ్మబాబోయ్.. హేమ కూతుర్ని చూశారా..!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు
Hema

Updated on: Jun 30, 2026 | 8:59 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారిలో నటి హేమ ఒకరు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు హేమ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె చాలా సినిమాలు చేశారు ఆమె. అలాగే తన కామెడీతో నవ్వులు పూయించారు. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ బ్రహ్మనందం కాంబినేషన్‌లో ఆమె చేసే సినిమాల్లోని సీన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అతడు సినిమాలో ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇలా చాలా సినిమాల్లో హేమ తన నటనతో అలరించారు. అలాగే సిద్దార్థ్ హీరోగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో తన నటనకుగానూ ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డును గెలుచుకున్నారు హేమ.

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

హేమ అసలు పేరు కృష్ణవేణి సినిమాల్లోకి వచ్చిన తర్వాత హేమగా మార్చుకున్నారు. ఇప్పటికే నటిగా హేమ 250 పైగా సినిమాల్లో నటించారు.ఇటీవలే ఓ వివాదంలో హేమ పేరు వినిపించినా.. దానిలో తన తప్పు లేదని నిరూపించుకున్నారు హేమ. తప్పు చేయకపోయినా తన పై కొందరు కావాలనే కుట్ర పన్నారని హేమ ఆరోపించారు. మొత్తానికి హేమ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకున్నారు. కాగా ప్రస్తుతం హేమ సినిమాల స్పీడ్ తగ్గించారు. ఇదిలా ఉంటే హేమ కూతురి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆస్కతికర చర్చ నడుస్తుంది.

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

నటి హేమ కూతురిని ఎప్పుడైనా చూశారా.? చూస్తే ఫిదా అవుతారు. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు హేమ కూతురు. ఆమెపేరు ఇషా. హేమ సయ్యద్ జాన్ అహ్మద్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇషా అనే కూతురు ఉంది. ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉన్న ఇషా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది తమ పిల్లలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. నాటు సురేఖ వాణి కూతురు కూడా ఇటీవలే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కాగా హేమ కూతురు ఇషాకు హీరోయిన్ అయ్యే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. కానీ హేమ మాత్రం కూతురిని ఇండస్ట్రీకి దూరంగా పెంచారు. ఇషా ను సినిమా ఫంక్షన్స్ కు కూడా పెద్దగా తీసుకురారు  హేమ. కాగా ఇషా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us