Honsika Motwani: ప్రియుడితో ఏడడుగుల బంధంలోకి హాన్సిక.. వైరలవుతున్న పెళ్లి ఫోటోస్..

గత నెల హన్సికకు ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద పెండ్లి ప్రపోజల్ చేశాడు. హన్సిక నటించిన మహా చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన MY3 వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది.

Honsika Motwani: ప్రియుడితో ఏడడుగుల బంధంలోకి హాన్సిక.. వైరలవుతున్న పెళ్లి ఫోటోస్..
Hansika

Updated on: Dec 05, 2022 | 8:15 AM

దేశముదురు బ్యూటీ హాన్సిక మోత్వానీ ప్రియుడు సొహైల్‏ కతూరియాతో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 4 ఆదివారం రాత్రి వీరి పెళ్లి ఘనంగా జరిగింది. రాజస్థాన్ జైపూర్ లోని ఓ కోటలో సింధీ సంప్రదాయం ప్రకారం వీరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహనికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వారం రోజుల ముందు నుంచే హన్సిక పెళ్లి సందడి షూరు అయ్యింది. శుక్రవారం సూపీ నైట్ వేడుకను జరిపారు. ఆ తర్వాత రాజస్థానీ తరహా డెర్ బీ గేమ్ జరగింది.

ఈ వేడుకలలో వధూవరులతోపాటు సన్నిహితులు పాటలకు డ్యాన్సులు చేశారు. హాన్సిక వెడ్డింగ్ వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అంతేకాదు.. పలు సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్న హన్సిక తను సహాయం అందిస్తున్న చిన్నారులనూ పెళ్లికి పిలిచింది.

ఇవి కూడా చదవండి

తన స్నేహితుడు.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సొహైల్ కతూరియా గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. తన పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేసిన అనంతరం.. గత నెల హన్సికకు ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద పెండ్లి ప్రపోజల్ చేశాడు. హన్సిక నటించిన మహా చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన MY3 వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us