Viral Photo: అందమైన సింధూరం.. నిత్య యవ్వన మకరందం.. తెలుగులో 30 సినిమాలు చేసిన ఈ నటిని గుర్తించారా..?

|

Feb 20, 2022 | 5:25 PM

సినిమా ఫీల్డ్‌లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. ఆ రంగంలో ముందుకెళ్లాలంటే ఆనపకాయ అంత టాలెంట్‌తో పాటు ఆవగింజ అంత అదృష్టం అంత ఉండాలంటారు.

Viral Photo: అందమైన సింధూరం.. నిత్య యవ్వన మకరందం.. తెలుగులో 30 సినిమాలు చేసిన ఈ నటిని గుర్తించారా..?
Tollywood Heroine
Follow us on

Tollywood News: సినిమా ఫీల్డ్‌లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. ఆ రంగంలో ముందుకెళ్లాలంటే ఆనపకాయ అంత టాలెంట్‌తో పాటు ఆవగింజ అంత అదృష్టం అంత ఉండాలంటారు. ఒక సినిమాతో గుర్తింపు వచ్చినా.. అది నిలబెట్టుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. హీరోలు నెగ్గుకొచ్చేందుకు కాస్త ఎక్కవ స్పేసే ఉంటుంది. కానీ హీరోయిన్లుకు వెంట వెంటనే 4, 5 ఫ్లాపులు వస్తే పక్కన పెట్టేస్తారు. చాలామంది హీరోయిన్లు బాగా రాణిస్తున్నా.. పెళ్లి అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారు. అలానే టాలీవుడ్‌లో హిట్ సినిమాల్లో రాణించి, అగ్రహీరోల పక్కన నటించి సడెన్‌గా అదృశ్యమైన హీరోయిన్లలో గజాల ఒకరు. ఒకానొక సమయంలో ఈ భామ టాప్ హీరోయిన్‌గా రాణించింది.  2001లో జగపతి బాబు హీరోగా నటించిన ‘నాలో ఉన్న ప్రేమ’  మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గజాల. ఆ తర్వాత రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన స్టూడెంట్‌ నెంబర్ 1 సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ మూవీ తర్వాత దూసుకుపోయింది గజాల. పక్కింటి అమ్మాయిలా ఉండే ఫీచర్స్‌తో యూత్‌కి బాగా కనెక్టయ్యింది  ఈ హీరోయిన్.

అల్లరి రాముడు, అదృష్టం, జానకి వెడ్స్ శ్రీరామ్, ఓ చిన్నదాన, తొట్టి గ్యాంగ్, విజయం, భద్రాద్రి, శ్రావణ మాసం, మనీ మనీ మోర్ మనీతో కలిసి దాదాపు 30 తెలుగు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.   2011 లో విడుదల అయిన మనీ మనీ మోర్ మనీ అనే సినిమా తర్వాత నుంచి గజాల ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. 2016లో టీవీ యాక్టర్ ఫైజల్ రజా ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అనంతరం ఫ్యామిలీతో కలిసి కువైట్‌లో సెటిల్‌ అయింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ లేటెస్ట్ ఫోటో నెట్టింట సర్కులేట్ అవుతుంది. ఇండస్ట్రీ దూరమై 10 ఏళ్లు అయినప్పటికీ.. అదే గ్లామర్‌తో నెటిజన్లను షాక్ గురి చేస్తుంది గజాలా.

Also Read:  నరాలు తెగే ఉత్కంఠ.. శవం పాతి పెట్టారన్న సమాచారంతో పోలీసుల తవ్వకాలు.. చివరికి ట్విస్ట్

సిమ్ కార్డు కొంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ వెన్నులో వణుకుపుట్టే విషయం