అలాంటి సినిమా చేయడమే నా కోరిక.. మనసులోమాట బయట పెట్టిన లేటెస్ట్ సెన్సేషన్
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ అందాల భామ పేరు మారుమ్రోగుతుంది. ఇప్పుడీ అమ్మడి పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకే ఒక సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగింది. ఇప్పుడు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయినా ముద్దగుమ్మలు చాలా మంది ఉన్నారు. అయితే సినిమా సక్సెస్ అయితే హీరోయిన్స్ కు క్రేజ్ వస్తుంది. కానీ ఈ అమ్మడి మాత్రం చాలా డిఫరెంట్. సినిమా ఫ్లాప్ అయినా ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. తొలి సినిమా డిజాస్టర్ అయినా కూడా ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ భామ. చేసింది తక్కువ సినిమాలే అయినా.. స్టార్ డమ్ తెచ్చుకుంది. ఒక్క సినిమా హిట్ అవ్వకపోయినా కూడా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?
ఆమె భాగ్యశ్రీ. రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ బ్యూటీ మాత్రం భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాలో తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టుంది. మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రాకముందే ఆఫర్లు దక్కించుకుందీ బ్యూటీ. ఇప్పటికే పలువురు మేకర్స్ భాగ్యశ్రీ డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ సినిమా హిట్ అయితే భాగ్యశ్రీటాలీవుడ్ లో దూసుకుపోవడం ఖాయం. దాంతో ఈ చిన్నది ఆశలన్నీ రామ్ సినిమా పైనే పెట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది తన స్టన్నింగ్ ఫొటోలతో కవ్విస్తుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తనకు అరుంధతిలాంటి సినిమాలు చేయాలని ఉందని తెలిపింది. అనుష్క నటించిన అరుంధతి తరహా ప్రాజెక్టులలో నటించడమే తన కోరిక అని చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడి కోరిక నేరవుతుందో లేదో చూడాలి.