160కిపైగా సినిమాలు.. స్టార్ హీరోలతో జతకట్టిన అందాల తార.. ఆమె చెల్లి కూడా తిరుగులేని హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటి అంబిక సినీ ప్రస్థానం, ఆమె వ్యక్తిగత జీవిత విశేషాలు. తన సోదరి రాధ కంటే ముందే చిత్ర పరిశ్రమకు వచ్చి, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అగ్ర హీరోలతో నటించి మెప్పించారు. చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి, తల్లి పాత్రల్లోనూ ఒదిగిపోయిన అంబిక, అమెరికాలో డాక్టర్‌ను వివాహమాడి, ఆపై విడాకులతో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు.

160కిపైగా సినిమాలు.. స్టార్ హీరోలతో జతకట్టిన అందాల తార.. ఆమె చెల్లి కూడా తిరుగులేని హీరోయిన్
Actress

Updated on: Sep 15, 2026 | 12:00 PM

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి అంబిక. ఆమె ప్రస్థానం కేవలం నటిగా మాత్రమే కాకుండా, ఒక సోదరిగా, వ్యాపారవేత్తగా, తల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. కేరళలోని కల్లార కుంజిన్ నాయర్, సరసమ్మ దంపతులకు జన్మించిన అంబిక, తన సోదరి రాధా కంటే ముందే వెండితెరకు పరిచయమయ్యారు. వారి తల్లి సరసమ్మ కేరళ కాంగ్రెస్ నాయకురాలిగా కూడా పనిచేశారు. మురళీ మోహన్ సరసన “అద్దాల మేడ” చిత్రంతో అంబిక తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో “విశ్వరూపం”, “బొబ్బిలి పులి” వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించి, అగ్ర కథానాయికగా తన సత్తా చాటారు. ఏఎన్నార్‌తో “ప్రేమ మందిరం” వంటి చిత్రాలలో కూడా ఆమె నటించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, మురళీ మోహన్, కృష్ణ రాజు వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేసిన అంబిక, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ తనదైన ముద్ర వేశారు.

రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, సత్యరాజ్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటించి, మూడు వందలకు పైగా చిత్రాలలో భాగమయ్యారు. మలయాళంలో దాదాపు 135 చిత్రాలు, తమిళంలో 165 చిత్రాలలో నటించారు. ఆమె నటించిన భాషల్లో మలయాళం, తమిళం ఎక్కువ సినిమాలు ఉన్నాయి.  అంబిక ముందు చిత్ర పరిశ్రమలోకి వచ్చినా, రాధా చిరంజీవి వంటి స్టార్‌లతో కలిసి చేసిన డాన్స్ , ఆమె గ్లామర్ పాత్రలకు ఎక్కువ స్టార్‌డమ్ లభించింది. అయినప్పటికీ, అంబిక తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్కాచెల్లెలిద్దరూ కేవలం నటనకే పరిమితం కాకుండా, మద్రాసు శివార్లలో “అంబికా రాధా గార్డెన్స్” పేరుతో ఒక స్టూడియో కాంప్లెక్స్‌ను నిర్మించారు. అవుట్‌డోర్ షూటింగ్‌లకు అనుకూలంగా పోలీస్ స్టేషన్, హాస్పిటల్, మధ్యతరగతి ఇల్లు వంటి సెట్‌లతో ఈ స్టూడియోలను రూపొందించారు.

హైదరాబాద్‌కు చిత్ర నిర్మాణం మారిన తర్వాత ఈ స్టూడియోను ఒక కాంప్లెక్స్‌గా మార్చారు. తర్వాత కాలంలో అంబిక మదర్ క్యారెక్టర్స్‌లోనూ, సహాయ పాత్రల్లోనూ నటించారు. మోహన్ బాబు కథానాయకుడిగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన “కొండవీటి సింహాసనం” చిత్రంలోనూ ఆమె ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో కూడా నటించి, తన నటనా ప్రస్థానాన్ని కొనసాగించారు. 1988లో, అంబిక అమెరికాకు చెందిన ఒక డాక్టర్‌ మీనన్ ను వివాహం చేసుకుని విదేశాలకు వెళ్లారు. ఎనిమిది సంవత్సరాల పాటు వైవాహిక జీవితం గడిపి, ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన తర్వాత, కొన్ని కారణాల వల్ల 1996లో ఆమె విడాకులు తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. అయినప్పటికీ, అంబిక తన జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, చిత్ర పరిశ్రమలో తన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us