Thaggede Le Movie: ఆసక్తికరంగా తగ్గేదే లే పోస్టర్.. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా నవీన్ చంద్ర సినిమా..

టాలీవుడ్‌లో భద్ర ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణ సంస్థగా అవతరించబోతోంది. విభిన్న చిత్రాలను భారీ బడ్జెట్‌లో నిర్మించేందుకు

Thaggede Le Movie: ఆసక్తికరంగా తగ్గేదే లే పోస్టర్.. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా నవీన్ చంద్ర సినిమా..
Thaggede Le

Updated on: Nov 24, 2021 | 9:03 AM

టాలీవుడ్‌లో భద్ర ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణ సంస్థగా అవతరించబోతోంది. విభిన్న చిత్రాలను భారీ బడ్జెట్‌లో నిర్మించేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా వారి మొదటి చిత్రం యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో శ్రీనివాస రాజు దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి ‘తగ్గేదే లే’ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.

ఈ సినిమాలో నవీన్ చంద్ర సరసన దివ్యా పిళ్లై హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా నిన్న దివ్యా పిళ్లై పుట్టినరోజు సందర్భంగా తగ్గేదే లే నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. చీరకట్టులో అందరినీ ఆకట్టుకుంది దివ్యా పిళ్లై.

నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు విశేషమైన ఆదరణ లభించింది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. దివ్యా పిళ్లై, అనన్య సేనుగుప్తా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, అయ్యప్ప శర్మ, నవీన్ చంద్ర, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్‌గా, చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు.

Also Read: Uday Kiran: కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. చనిపోయే ముందు అంతలా..

Naatu Naatu Song: నాటు నాటు సాంగ్ స్టెప్పుల కోసం అన్ని టేక్స్ తీసుకున్నాం.. ఆసక్తికర విషయాలను చెప్పిన ఎన్టీఆర్..

Chiranjeevi: మెగాస్టార్‌ రాకతో చిన్నప్పటి నా మాటలు నిజమయ్యాయి.. కార్తికేయ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Follow Us