Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం రిసెప్షన్ వేడుకలు.. సొంత ఊరిలో మామిడి తోటలో సింపుల్‏గా.. ఫోటోస్ వైరల్..

రాజావారు రాణిగారు సినిమాతో హీరోహీరోయిన్లుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ లవ్ బర్డ్స్ తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు నచ్చిన జంటగా గుర్తింపు తెచ్చుకుంది. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ఏడాది తమ నిశ్చితార్థం ప్రకటనతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కిరణ్, రహస్య పెళ్లి ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. వీరి వివాహం కర్ణాటకలోని కూర్గ్ లో జరిగింది.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం రిసెప్షన్ వేడుకలు.. సొంత ఊరిలో మామిడి తోటలో సింపుల్‏గా.. ఫోటోస్ వైరల్..
Kiran Abbavaram

Updated on: Aug 28, 2024 | 7:01 AM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే బ్యాచిలర్ లైఫ్‏కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు రహస్య గోరఖ్‏ను ఈనెల 22న పెళ్లి చేసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్‏గా పనిచేసిన రహస్య, కిరణ్ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టారు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోహీరోయిన్లుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ లవ్ బర్డ్స్ తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు నచ్చిన జంటగా గుర్తింపు తెచ్చుకుంది. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ఏడాది తమ నిశ్చితార్థం ప్రకటనతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కిరణ్, రహస్య పెళ్లి ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. వీరి వివాహం కర్ణాటకలోని కూర్గ్ లో జరిగింది.

ఇక తాజాగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ల రిసెప్షన్ వేడుకలు కిరణ్ సొంతూరు రాయచోటిలో పెద కోడివాండ్ల పల్లిలో జరిగింది. తన ఊళ్లో ఓ మామిడి తోటలో చెట్ల కింద రిసెప్షన్ వేడుకలను ఎంతో సింపుల్ గా అరెంజ్ చేశాడు. ఇరు కుటుంబాలు, బంధువులతోపాటు ఊర్లో జనాలకు భోజనాలు పెట్టాడు కిరణ్. వీరి రిసెప్షన్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి.

రాజావారు రాణిగారు సినిమా తర్వాత SR కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. ఈ మూవీతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు రాగా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరగా రూల్స్ రంజాన్ చిత్రంలో కనిపించాడు కిరణ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us