
సీనియర్ హీరో సాయి కుమార్ తనయుడిగా సినీ పరిశ్రమకు అరంగేట్రం చేసిన యువ నటుడు ఆది సాయి కుమార్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రేమ కావాలి సినిమాలోని ఆది నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక ఆ తర్వాత ఈహీరో లవ్లీ, సుకుమారుడు వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకలను అలరించాడు. ఇక గత కొంచ కాలంగా ఆది కెరీర్లో సరైన హిట్ పడలేదు. దీంతో ప్రస్తుతం చేయబోయే సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కేవలం కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆది సాయి కుమార్ తన తదుపరి సినిమాను ప్రారంభించాడు.
ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో విజన్ సినిమాస్ బ్యానర్ పై వ్యాపారవేత్త నాగం తిరుపతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆది సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆది మునుపెన్నడు చూడని పాత్రలో కనిపిస్తారని మేకర్స్ వెల్లడించారు. సునీల్, పూర్ణ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీకి టీఎంకె అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిన్న ఈ సినిమాను హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. మణికాంత్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
ట్వీట్..
Dia Movie Telugu: సూపర్ హిట్ సినిమా దియా ఇప్పుడు తెలుగులో.. రిలీజ్ ఎప్పుడో తెలుసా..
Raviteja: మరోసారి హిట్ కాంబో రిపీట్ కాబోతుందా ? సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌తో మాస్ మాహారాజా..