Cinema: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న మరో చిన్న సినిమా.. ఎగబడి చూస్తోన్న యూత్.. తెలుగులోనూ భారీ కలెక్షన్లు

చిన్న సినిమాలు కూడా అద్భుతాలు చేయగలవు. ఆకట్టుకునే కంటెంట్ తో కలెక్షన్ల వర్షం కురిపించగలవు. ప్రస్తుతం అలాంటి ఓ చిన్న సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయింది.

Cinema: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న మరో చిన్న సినిమా.. ఎగబడి చూస్తోన్న యూత్.. తెలుగులోనూ భారీ కలెక్షన్లు
With Love movie

Updated on: Feb 10, 2026 | 7:55 AM

గత వారం విడుదలైన తమిళ సినిమా ‘విత్ లవ్’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తెలుగులోనూ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 11 కోట్లకు పైగా వసూలు చేసింది. నూతన దర్శకుడు మధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్, ఛాంపియన్ హీరోయిన్ అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చాలా తక్కువ బడ్జెట్, కొత్త ముఖాలతో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఫిబ్రవరి 6న విడుదలైన విత్ లవ్ సినిమా మొదటి రోజు దాదాపు 1.6 కోట్ల నికర వసూళ్లు సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ శనివారం కలెక్షన్లు పెరిగి 2.5 కోట్లకు చేరుకున్నాయి. మూడవ రోజు, ఆదివారం, ఇది 3 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనితో ఈ మూవీ మొత్తం మూడు రోజుల నికర వసూళ్లు 7.14 కోట్లకు చేరుకున్నాయి. నిర్మాణ సంస్థ పోస్టర్ ప్రకారం, ఓవర్సీస్ మార్కెట్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు 11 కోట్లకు పైగా ఉన్నాయి. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ఇది తమిళనాడులోనే 6 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

‘విత్ లవ్’ సినిమా కథ విషయానికి వస్తే.. సత్య శీలన్ (అభిషన్ జీవింత్) అనే డిజైనర్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. అతనికి అరెంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ తన చెల్లి ఒత్తిడి మేరకు ఒక బ్లైండ్ డేట్‌కి వెళ్తాడు. అక్కడ అతనికి మోనిష (అనస్వరా రాజన్) పరిచయం అవుతుంది. మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్‌లో సీనియర్, జూనియర్స్ అని తెలుసుకుంటారు. అలా మొదలైన వారి ప్రయాణం.. ఫస్ట్ లవ్, బ్రేకప్, గతాన్ని తలుచుకోవడం, వదిలేసిన జ్ఞాపకాలను మళ్ళీ స్పృశించడం అనే భావోద్వేగాల వైపు ఎలా సాగిందనేదే మిగతా కథ.

ఇవి కూడా చదవండి

అభిషన్ జీవింత్ గతంలో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ ఈసారి అతను హీరోగా అరంగేట్రం చేశాడు. సినిమాలో అతని నటనను ప్రేక్షకులు బాగా అభినందిస్తున్నారు. ఇక ఛాంపియన్ తో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన అనస్వర అందం, అభినయానికి మరోసారి ఫిదా అయ్యారు ఆడియెన్స్. ఈ చిత్రాన్ని MRP ఎంటర్‌టైన్‌మెంట్, జియో ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ పసిలియన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 4 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే మూడు రెట్లు ఎక్కువ లాభాలు సంపాదించింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

 అనిల్ రావిపూడి ప్రశంసలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.