ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప(Pushpa) సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎర్ర చందనం స్మగ్లర్ గా బన్నీ నటన విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు శ్రోతలను ఉర్రుతలూగించాయి. పుష్ప సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఈ పాటలకు అల్లు అర్జున్ రష్మిక చేసిన డ్యాన్స్ మూమెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ లో బన్నీ హుక్ స్టెప్, అలాగే సామీ సామీ సాంగ్ లో రష్మిక స్టెప్ యమా క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికే ఈ పాటలపై చాలా మంది వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సినిమా తారలు సైతం ఈ పాటలకు స్టెప్పులేశారు.
తాజాగా ఓ వ్యక్తి పుష్ప సినిమాలోని సామీ సామీ పాటకు డ్యాన్స్ వేశాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అయితే అమ్మాయిలు ధరించే స్కర్ట్ వేసుకొని ఆ యువకుడు డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. రష్మిక వేసిన స్టెప్పు ను అచ్చు గుద్దినట్టు దించేశాడు ఆ యువకుడు. ఇంతకు అతను ఎవరంటే.. అతడి పేరు కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా.. ఇతను ఎప్పుడూ అమ్మాయిల మాదిరిగా డ్రస్ చేసుకొని అమెరికా వీధుల్లో డ్యాన్స్ లు వేస్తూ ఉంటాడట..ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల మంది చూసేశారు. అయితే ఆ యువకుడి డ్యాన్స్‌లను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుడగా.. మరికొందరు మాత్రం.. అమ్మాయిల డ్రెస్సులే ఎందుకు వేసుకోవాలి అబ్బాయిలా డ్రస్ చేసుకోని కూడా డ్యాన్స్ వేయవచ్చు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :