Tollywood: దేవుడికి తలనీలాలు సమర్పించి, నాలుకపై శూలం గుచ్చుకుని.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

పై ఫొటోలో గుండుతో కనిపిస్తున్న మహిళ ఎవరో గుర్తుపట్టారా? ఈమె ఒకప్పుడు తెలుగు, తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మరికొన్ని సినిమాల్లో సహాయ నటిగా ఆడియెన్స్ ను మెప్పించింది. ఈమె తెలుగులో హీరోయిన్ గా చేసింది ఒక్క సినిమానే. అయితేనేం యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది

Tollywood: దేవుడికి తలనీలాలు సమర్పించి, నాలుకపై శూలం గుచ్చుకుని.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us

|

Updated on: Jun 16, 2024 | 8:39 PM

పై ఫొటోలో గుండుతో కనిపిస్తున్న మహిళ ఎవరో గుర్తుపట్టారా? ఈమె ఒకప్పుడు తెలుగు, తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మరికొన్ని సినిమాల్లో సహాయ నటిగా ఆడియెన్స్ ను మెప్పించింది. ఈమె తెలుగులో హీరోయిన్ గా చేసింది ఒక్క సినిమానే. అయితేనేం యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కానీ ఎందుకో తెలుగులో హీరోయిన్ గా కొనసాగలేకపోయింది. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ తోనే సరిపెట్టుకుంది. కేవలం తమిళ్ సినిమాలకే పరిమితమైంది. మరి ఈ తార ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉంది కదా! అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. ఈమె మరెవరో కాదు 10th క్లాస్‌ హీరోయిన్ శరణ్య. తాజాగా ఆమె తమిళనాడు లోని ప్రముక దేవాలయం తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంది. స్వామివారికి తలనీలాలు సమర్పించింది. అంతేగాకుండా నాలుకపై శూలం పొడిపించుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది శరణ్య. దీంతో అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

సాధారణంగా అమ్మాయిలకు జుట్టు అంటే చాలా ఇష్టం. ఎంత పొడవుగా పెంచుకుంటే అంత అందంగా కనిపిస్తామన్నది వారి భావన. అందుకే మొక్కులు చెల్లించేటప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు జస్ట్ మూడు కత్తెర్లు ఇస్తారు. కానీ శరణ్య మాత్రం తన కేశాలను పూర్తిగా స్వామివారికి మొక్కుగా చెల్లించింది. దీంతో అభిమానులు, నెటిజన్లు శరణ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

10th క్లాస్ మూవీలో హీరోయిన్ గా నటించిన శరణ్య అంతకు ముందు నీ మనసు నాకు తెలుసు సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా కనిపించింది. అలాగే ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా తదితర చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించింది. అయితే తమిళంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దేవుడికి మొక్కు చెల్లించుకుంటున్న నటి శరణ్య… వీడియో ఇదిగో..

తిరుత్తణి ఆలయంలో నటి శరణ్య.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles